ఏపీ ఈఎస్ఐ స్కాంలో మరో ట్విస్ట్.. ఏసీబీ కోర్టులో లొంగిపోయిన నిందితుడు.. మందుల కొనుగోలులో ప్రమోద్‌రెడ్డి ప్రమేయం
ఏపీ ఈఎస్ఐ స్కామ్‌లో నిందితుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. రూ. 150 కోట్ల కుంభకోణంలో ఏ3 నిందితుడిగా ఉన్న బి. ప్రమోద్‌రెడ్డి ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. మందుల కొనుగోలు వ్యవహారంలో ప్రమోద్‌రెడ్డి ప్రమేయం ఉన్నట్లు తేలడంతోనే ముందస్తు బెయిల్..
ఏపీ ఈఎస్ఐ స్కామ్‌లో నిందితుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. రూ. 150 కోట్ల కుంభకోణంలో ఏ3 నిందితుడిగా ఉన్న బి. ప్రమోద్‌రెడ్డి ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. మందుల కొనుగోలు వ్యవహారంలో ప్రమోద్‌రెడ్డి ప్రమేయం ఉన్నట్లు తేలడంతోనే ముందస్తు బెయిల్ కోసం అతను కోర్టును ఆశ్రయించారు. అయితే ఏసీబీ కోర్టు ప్రమోద్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ని తిరస్కరించింది. 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆతడ్ని మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు.
ఈఎస్ఐలో 2014 నుంచి 2019 వరకు నిబంధనలకు విరుద్ధంగా రూ. 988.77 కోట్ల విలువైన మందులు, వైద్య పరికరాల కొనుగోలు, టెలీ సర్వీసెస్ సేవల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. ఇందుకు ప్రతిగా అప్పటి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రైవేటు వ్యక్తులు కలిసి రూ.150 కోట్లకు పైగా అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించింది.
ఈఎస్ఐ లో జరిగిన భారీ కుంభకోణంలో మూలాలపై ఏసీబీ దృష్టిపెట్టింది. ఈ కేసులో ఇప్పటికే పలువుర్ని అరెస్ట్ చేసింది. స్కామ్‌తో ప్రమేయమున్న వారి కాల్‌లిస్ట్‌ను సేకరించి లోతైన దర్యాప్తు చేసింది. తాజాగా ఏ3గా ఉన్న ప్రమోద్‌రెడ్డిని జైలుకు పంపించారు ఏసీబీ అధికారులు.