AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో పెరుగుతున్న కోలుకుంటున్నవారి సంఖ్య

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మరోసారి స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 6,190 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.

ఏపీలో పెరుగుతున్న కోలుకుంటున్నవారి సంఖ్య
Balaraju Goud
|

Updated on: Sep 29, 2020 | 7:37 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మరోసారి స్వల్పంగా పెరిగాయి. గత కొద్దిరోజులుగా అత్యధిక కేసులు నమోదైన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో స్వల్పంగా తగ్గిపోయాయి. గడిచిన 24 గంటల్లో 68,429 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 6,190 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో తెలిపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 6,87,351కు చేరుకున్నాయి.

మరోవైపు, రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య కాస్త తగ్గింది. సోమవారం కరోనా బారిన పడి 37 మంది ప్రాణాలను కోల్పోగా.. మంగళవారం ఆ సంఖ్య 35గా నమోదైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 5,780కు చేరుకుంది. కరోనా మహమ్మారి బారిన పడి గడిచిన 24 గంటల్లో ప్రకాశం జిల్లాలో 8 మంది, చిత్తూరులో ఆరుగురు, అనంతపురంలో నలుగురు, తూర్పు గోదావరిలో నలుగురు, గుంటూరులో నలుగురు, విశాఖపట్నంలో ముగ్గురు, నెల్లూరులో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, శ్రీకాకుళంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు.

అటు, కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. మంగళవారం 9,836 మంది కరోనా మహమ్మారిని పూర్తిగా జయించి డిశ్చార్జి అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6,87,351 పాజిటివ్ కేసులకు గాను, 6,22,136 మంది కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 59,435 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Follow Us
ఈ సినిమా చేసి తప్పు చేశా..
ఈ సినిమా చేసి తప్పు చేశా..
చికెన్, మటన్ లేకుండా ఈ బిర్యానీ రుచి ఎందుకంత స్పెషల్?
చికెన్, మటన్ లేకుండా ఈ బిర్యానీ రుచి ఎందుకంత స్పెషల్?
ISROలో భారీగా సైంటిస్ట్‌ ఉద్యోగాలు.. సెప్టెంబరు 16 వరకే ఛాన్స్‌!
ISROలో భారీగా సైంటిస్ట్‌ ఉద్యోగాలు.. సెప్టెంబరు 16 వరకే ఛాన్స్‌!
బకెట్ నీళ్లలో ఇది 2 చుక్కలు వేస్తే చాలు.. మీ ఇంటి నేల మొత్తం..
బకెట్ నీళ్లలో ఇది 2 చుక్కలు వేస్తే చాలు.. మీ ఇంటి నేల మొత్తం..
నేపాల్ వరదల్లో గల్లంతైన ఏపీకి చెందిన నలుగురు ఎన్‌ఆర్‌ఐలు
నేపాల్ వరదల్లో గల్లంతైన ఏపీకి చెందిన నలుగురు ఎన్‌ఆర్‌ఐలు
ఆరోగ్యంగా నూరేళ్లు జీవించాలంటే? చాణక్యుని 7 ఆరోగ్య సూత్రాలు ఇవే
ఆరోగ్యంగా నూరేళ్లు జీవించాలంటే? చాణక్యుని 7 ఆరోగ్య సూత్రాలు ఇవే
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 వాతావరణం ఎలా ఉంటుందంటే?
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 వాతావరణం ఎలా ఉంటుందంటే?
చిన్న చేతులు.. పెద్ద మనసు.. పిల్లలు పిల్లిని ఎలా కాపాడారో..
చిన్న చేతులు.. పెద్ద మనసు.. పిల్లలు పిల్లిని ఎలా కాపాడారో..
29ఏళ్లకే రిటైర్‌మెంట్..జాబ్‌కి గుడ్‌బై చెప్పి ఏం చేస్తుందో చూడండి
29ఏళ్లకే రిటైర్‌మెంట్..జాబ్‌కి గుడ్‌బై చెప్పి ఏం చేస్తుందో చూడండి
ఎన్‌టీఏ డైరెక్టర్‌గా ఏపీ కేడర్ ఐఏఎస్ వి. ప్రసన్న వెంకటేష్
ఎన్‌టీఏ డైరెక్టర్‌గా ఏపీ కేడర్ ఐఏఎస్ వి. ప్రసన్న వెంకటేష్