ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 64,425 కరోనా టెస్టులు చేయగా.. 520 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,74,515కి చేరింది. రాష్ట్రంలో మరో ఇద్దరు కరోనా కారణంగా ప్రాణాలు విడిచినట్టు వైద్యారోగ్య శాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 7,049 కు చేరింది. కొత్తగా 519 మంది పూర్తిగా కోలుకొని ఇళ్లకు వెళ్లిపోగా.. మొత్తం రికవరీల సంఖ్య 8,62,230కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,236 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,06,99,622 కరోనా సాంపుల్స్‌ని ఆరోగ్య శాఖ టెస్ట్ చేసింది.
అయితే కరోనా వ్యాప్తి తగ్గిందని ప్రజలు జాగ్రత్తలు పాటించకపోతే విపత్కర పరిస్థితులు ఎదరవుతాయని ఆరోగ్య నిపుణుల చెబుతున్నారు. మాస్క్‌లు, శానిటైజర్లు వినియోగించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉంటే వెంటనే కరోనా టెస్ట్ చేయించుకోవాలని చెబుతున్నారు.
Also Read :
అగ్గితో ఆటలొద్దు..సీఎం మమతా బెనర్జీకు గవర్నర్ జగ్దీప్ ధనకర్ డైరెక్ట్ వార్నింగ్
రైతులకు ఆదాయం పెంచే విధానాలపై ఫోకస్ పెట్టండి, బ్యాంకర్లకు సీఎం జగన్ సూచన