AP Corona Cases : ఏపీలో కొత్తగా 500 వైరస్ పాజిటివ్ కేసులు, యాక్టీవ్ కేసుల సంఖ్య ఎంతంటే..?

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 61,452 సాంపిల్స్ టెస్ట్ చేయగా, 500 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 876336 కు చేరింది.

AP Corona Cases : ఏపీలో కొత్తగా 500 వైరస్ పాజిటివ్ కేసులు, యాక్టీవ్ కేసుల సంఖ్య ఎంతంటే..?

Updated on: Dec 15, 2020 | 6:32 PM

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 61,452 సాంపిల్స్ టెస్ట్ చేయగా, 500 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 876336 కు చేరింది. రాష్ట్రంలో మరో ఐదుగురు కోవిడ్ కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 7064కు చేరింది. కొత్తగా కృష్ణా జిల్లాలో ఇద్దరు, చిత్తూరు, నెల్లూరు, గుంటూరు జిల్లాలలో ఒక్కొక్కరి చొప్పున ప్రాణాలు విడిచారు. కొత్తగా 563 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 864612 కు చేరింది. ప్రస్తుతం ఏపీలో 4,660 యాక్టివ్‌ కేసులున్నాయి. నేటి వరకు రాష్ట్రంలో 1,09,37,377 సాంపిల్స్ టెస్ట్ చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది.

Also Read :

ప్రిన్సిపాల్ గారూ..! సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు..పిల్లల ముందు చేసేది ఇలాంటి పనులేనా?

55 అడుగుల కొబ్బరి చెట్టుపై అచేతనంగా పడి ఉన్న వ్యక్తి..స్థానికులు సమాచారంతో స్పాట్‌కు పోలీసులు..ట్విస్ట్ ఏంటంటే