AP Corona Cases : రాష్ట్రంలో కొత్తగా 238 పాజిటివ్ కేసులు..మరణాలు, యాక్టీవ్ కేసుల సంఖ్య తదితర వివరాలు

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 48,518 శాంపిల్స్ టెస్ట్ చేయగా..238 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం...

AP Corona Cases : రాష్ట్రంలో కొత్తగా 238 పాజిటివ్ కేసులు..మరణాలు, యాక్టీవ్ కేసుల సంఖ్య తదితర వివరాలు
AP-Corona

Updated on: Jan 02, 2021 | 5:35 PM

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 48,518 శాంపిల్స్ టెస్ట్ చేయగా..238 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 882850 కు చేరింది. వైరస్ కారణంగా కొత్తగా ముగ్గురు(పశ్చిమ గోదావరి ఇద్దరు, చిత్తూరు ఒకరు) మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 7111కు చేరింది. ప్రస్తుతం 3194 యాక్టీవ్ కేసులున్నాయి. కొత్తగా 279 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 872545 కు చేరింది. ఇప్పటివరకు ఏపీలో 1,19,32,603 శాంపిల్స్‌ పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్‌లో వెల్లడించింది.

పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినప్పటికీ..జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంగా ఉండకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చలి తీవ్రత అధికంగా ఉన్నందున వైరస్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని హెచ్చరిస్తున్నారు.

Also Read :

Sourav Ganguly health latest update : దాదాకు పూర్తయిన యాంజియోప్లాస్టీ..డాక్టర్లు ఏం చెప్పారంటే..?

Leaders Visit To Ramatheertham : రాజకీయ రణరంగమైన రామతీర్థం..నేతల పర్యటనలతో పెరగిన హీట్