Live Updates: ‘రైతుకు ధీమా.. పంటకు బీమా’. ఏపీలో రైతన్నలకు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పరిహారం చెల్లింపు

ఆంధ్రప్రదేశ్ లోని రైతాంగానికి తీపి కబురు చెప్పింది ఏపీ సర్కారు.జ పంటనష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించింది. డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల..

Live Updates: రైతుకు ధీమా.. పంటకు బీమా. ఏపీలో రైతన్నలకు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పరిహారం చెల్లింపు

Edited By:

Updated on: Dec 15, 2020 | 1:27 PM

ఆంధ్రప్రదేశ్ లోని రైతాంగానికి తీపి కబురు చెప్పింది ఏపీ సర్కారు. పంటనష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించింది. డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం కింద ఈ కార్యక్రామానికి శ్రీకారం చుట్టింది జగన్ ప్రభుత్వం. ఈ మేరకు చెల్లింపుల వివరాలను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడిస్తున్నారు. లైవ్ చూద్దాం..

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 15 Dec 2020 01:22 PM (IST)

    అర్హులైన రైతులకు పరిహారం అందించాలన్న తపన.. లర్హులు అందరికీ అందించాలన్న తపన, తాపత్రయంతో ముందడుగు వెళ్తున్నాం..

    రైతు భరోసా కేంద్రాల ద్వారా పంటను ఈ–క్రాపింగ్‌ చేసి, వైపరీతాల్య వల్ల పంటలు నష్టపోతే.. నష్టం అంచనాలు వేసి.. వెంటనే బీమా పరిహారాన్ని చెల్లిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఒక్క ఈ-క్రాపింగ్‌ వివరాలు మాత్రమే కాకుండా, ఇన్సూరెన్స్‌ లబ్ధిదారుల వివరాలను కూడా అందిస్తున్నామన్నారు. అర్హులందరికీ పరిహారాన్ని అందించాలన్న తపన, తాపత్రయంతోనే ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నామన్నారు.

    2020 ఖరీఫ్‌కు సంబంధించి జనవరిలో పంటకోత ఎక్స్‌పర్‌మెంట్స్‌ కాగానే ఫిబ్రవరిలో ప్రణాళికా శాఖ నుంచి వివరాలు తీసుకుని మార్చి – ఏప్రిల్‌లోగా చెల్లిస్తామన్నారు. దీని వల్ల మళ్లీ ఖరీఫ్‌కు సిద్ధంగా ఉండవచ్చునని, జూన్‌కు తిరిగి పంటలు వేసుకునేందుకు అవకాశం ఉంటుందని అన్నారు.

    త్వరగా పరిహారం అందించడం ఎప్పుడూ జరగలేదు:

    మొట్టమొదటి సారిగా రైతుకు ఏదైనా నష్టం జరిగితే.. మొన్న జరిగిన అకాల వర్షాల తరహాలో ఏదైనా జరిగితే రంగు మారిన ధాన్యమే కాదు, మొలకలెత్తిన ధాన్యాన్ని కూడా గ్రేడెడ్‌ ఎంఎస్‌పీ కింద కొనుగోలు చేసే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోందని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా గడచిన 18 నెలలుగా మనసున్న ప్రభుత్వంగా రైతులకు మంచి చేయాలన్న తపన, తాపత్రయంతోనే ఒక్కోఅడుగుముందుకు వేస్తున్నామని తెలిపారు.

  • 15 Dec 2020 01:14 PM (IST)

    ఏ సీజన్‌కు జరిగిన పంటనష్టం.. అదే సీజన్‌లో ఇచ్చాం: సీఎం జగన్

    రైతుల కోసం ప్రతీ గ్రామంలోనూ ఆర్బీకేలు ఉన్నాయన్న సీఎం జగన్.. అవన్నీ కూడా గ్రామ సచివాలయంలో అనుసంధానం అవుతాయన్నారు. గ్రామంలో ప్రతి ఎకరా ఈ–క్రాపింగ్ ‌జరుగుతుందని చెప్పారు. ఈ వివరాలను ఆర్బీకేల్లో డిస్‌ ప్లే చేస్తామన్నారు. దీని వల్ల పారదర్శకంగా పనులు జరుగుతున్నాయని సీఎం జగన్ తెలిపారు.

    మొన్న వర్షాలు వచ్చి ఇబ్బందులు పడిన పరిస్థితుల్లోనూ.. వెంటనే ఆయా గ్రామాల్లోని ఆర్బీకేల పరిధిలో ఉన్న ఈ–క్రాపింగ్ ‌డేటా ఆధారంగా వెంటనే పంటనష్టం అంచనాలు నమోదుచేసి… వివరాలను ఆర్బీకేల్లో ఉంచామని సీఎం చెప్పారు. ఏ రైతుకూ నష్టం రాకూడదు, ఎవ్వరూ మిగిలిపోకూడదని ఇలా చేస్తున్నాం. అలాగే ఏ సీజన్‌కు జరిగిన పంటనష్టం.. అదే సీజన్‌లో ఇచ్చామని సీఎం జగన్ తెలిపారు. ఇంకా ఎవరైనా మిగిలిపోతే వారం రోజుల్లో నమోదు చేసుకోవచ్చునని.. వారికి డిసెంబర్‌ 31లోగా ఇన్‌పుట్‌ సబ్సిడీని బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తామన్నారు.


  • 15 Dec 2020 01:04 PM (IST)

    సుమారు 49.81 లక్షల మంది రైతులు.. కోటి 14వేల ఎకరాలు ఇన్సూరెన్స్‌ కిందకు వచ్చాయి: జగన్

    గతంలో ఇన్సూరెన్స్ రైతులు ఒక భాగం, రాష్ట్ర ప్రభుత్వం ఒక భాగం, కేంద్ర ప్రభుత్వం ఒక భాగం చెల్లించేది. ఇక ఇన్సూరెన్స్ చెల్లింపు తర్వాత బీమా సొమ్ము కోసం ప్రయత్నాలు చేసిన సందర్భాలు లేవు. ఎందుకు రాలేదని అడిగే పరిస్థితి లేదు. 2012 ఇన్సూరెన్స్‌ డబ్బును కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పించడం జరిగిందని సీఎం జగన్ అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

    జగన్ కామెంట్స్ ఇలా ఉన్నాయి… 

    2016–17 నుంచి 2018–19న రైతులు సగటున బీమా కంపెనీలకు రూ.298 కోట్లు కట్టేవారు

    రాష్ట్ర ప్రభుత్వం తరఫున సగటున సంవత్సరానికి రూ. 393 కోట్లు చెల్లించేవాళ్లం

    మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రైతుకూ మంచి జరగాలని సంకల్పించాం

    రైతులు కట్టాల్సిన వాటా- రూ.468 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కట్టాల్సిన వాటా రూ. 503 కోట్లు వెరిసి మొత్తం రూ. 971 కోట్లు చెల్లించాం

    గత ప్రభుత్వం హయాంలో ఏడాదికి సగటున 20 లక్షల మంది రైతులూ ఇన్సూరెన్స్‌ కట్టేవారు

    ఇవాళ సుమారు 49.81 లక్షల మంది రైతులు ఇన్సూరెన్స్‌ కిందకు వచ్చారు

    గతంలో సగటున 23. 57 లక్షల హెక్టర్లు ఇన్సూరెన్స్‌ పరిధిలో ఉంటే.. ఇప్పుడు 45.96లక్షల హెక్టర్లు ఇన్సూరెన్స్‌ కిందకు వచ్చాయి

  • 15 Dec 2020 12:56 PM (IST)

    గతంలో పంటల బీమా ఎవరికి వచ్చేదో రైతులకే అర్థం అయ్యేది కాదు?

    గతంలో పంటల బీమా వల్ల ప్రయోజనం లేదన్న అభిప్రాయం రైతులకు ఉండేది. బీమా వస్తుందో, లేదో తెలిసేది కాదు. దీని వల్ల బీమా చేసుకున్న రైతుల సంఖ్య తక్కువగా ఉండేది. రైతులు పెద్దగా ఆసక్తి చూపని పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితిలో మార్పులు రావాలని సంకల్పించాం.

    పంట బీమా గుదిబండ కాకూడదని, బీమా చెల్లింపు వ్యవస్థపై విశ్వసనీయత రైతులకు రావాలన్న ఉద్దేశంతో అడుగులు ముందుకు వేశాం. ఎన్నికల్లో చెప్పినట్టుగా, పాదయాత్రలో చెప్పినట్టుగా పంట బీమా గురించి రైతులు ఆలోచించాల్సిన అవసరం లేకుండా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించింది. కేంద్ర ప్రభుత్వంతోనూ, ఇన్సూరెన్స్‌ కంపెనీలతోనూ మాట్లాడే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది. రైతులకు నష్టం రాకుండా బీమా సొమ్మును సరైన సమయంలో అందించాలన్న తాపత్రయంతో అడుగులు ముందుకు వేశామని సీఎం జగన్ అన్నారు.

  • 15 Dec 2020 12:49 PM (IST)

    రైతులకు ఖాతాల్లో నేరుగా పంట బీమా డబ్బు జమ..

    2019 సీజన్‌లో పంట నష్టపోయిన సుమారు 9.48 లక్షల మంది రైతులకు రూ.1252 కోట్లను ఇవాళ వారి ఖాతాల్లో జమ చేస్తున్నాం. ఇక ఇదే విషయాన్ని కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో చెప్పమని.. అదే విధంగా డిసెంబర్ 15న ఇవ్వనున్నట్లు అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రస్తావించామన్నారు. ఆ మాటకు కట్టుబడి అదే డిసెంబర్‌ 15న ఈ కార్యక్రమానికి అడుగులు ముందుకు వేశామని సీఎం జగన్ వివరించారు.

  • 15 Dec 2020 12:45 PM (IST)

    రైతులకు మంచి చేసే దిశగా మరో అడుగు వేస్తున్నాం.. సీఎం జగన్..

    ‘వైఎస్సార్ ఉచిత పంటల బీమా పధకం’ ద్వారా రైతులకు మంచి చేసే దిశగా మరో అడుగు వేస్తున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. గత 18 నెలలుగా ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతూ వస్తోందని అన్నారు. ప్రతీ అడుగూ రైతుకు తోడుగా ఉంటామని.. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని సీఎం జగన్ వెల్లడించారు. విత్తనం నుంచి రైతు పంట అమ్మకం వరకూ తోడుగా ఉంటున్నామన్నారు. కరువులు, వర్షాల వల్ల పంట నష్టపోయిన వారికి అండగా ఉండడానికి ప్రభుత్వం ఎంత మనసు పెడుతుందో.. తాజాగా చేపట్టిన కార్యక్రమమే అందుకు ఉదాహరణ అని సీఎం జగన్  స్పష్టం చేశారు.

  • 15 Dec 2020 12:42 PM (IST)

    రైతుల కోసం ‘వైఎస్సార్ ఉచిత పంటల బీమా పధకం’.. ప్రారంభించిన సీఎం జగన్..

    ఏపీ రైతులకు కోసం సీఎం వైఎస్ జగన్ ‘వైఎస్సార్ ఉచిత పంటల బీమా’ పధకాన్ని ప్రారంభించారు. 2019 సీజన్లో పంట నష్టపోయిన సుమారు 9.48 లక్షల రైతులకు ఉచితంగా పంటల బీమా ఇవ్వనున్నట్లు తెలిపారు. వారికి రూ. 1,252 కోట్ల పరిహారం చెల్లిస్తామన్నారు. ఈ డబ్బు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామన్నారు.