కడపలో ఏపీ సీఎం జగన్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి రెండు రోజుల పర్యటనకు కడప బయలుదేరనున్నారు. ఇవాళ, రేపు కడప జిల్లాలోనే గడపనున్నారు.

కడపలో ఏపీ సీఎం జగన్ పర్యటన

Updated on: Jul 07, 2020 | 9:39 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి రెండు రోజుల పర్యటనకు కడప బయలుదేరనున్నారు. ఇవాళ, రేపు కడప జిల్లాలోనే గడపనున్నారు. బుధవారం దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా ఆయనకు సీఎం కుటుంబసభ్యులతో కలిసి నివాళ్లు అర్పించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు ద్వారా కడపకు బయలుదేరనున్నారు. ప్రత్యేక విమానంలో సీఎం జగన్ కడప చేరుకోనున్నారు. సాయంత్రం 4.55 గంటలకు కడప ఎయిర్ ఫోర్టు నుండి ఇడుపులపాయకు హెలికాప్టర్‌లో వెళ్లనున్నారు. నేడు ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఎస్టేట్స్‌లోని గెస్ట్ హౌస్‌లో సీఎం జగన్ బస చేయనున్నట్లు సీఎంవో కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.