AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రీ ప్రైమరీ విద్యపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్..

ప్రీ ప్రైమరీ విద్యపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. అంగన్‌వాడీ కేంద్రాలకు అనుబంధంగా వీటిని నిర్వహించాలని సూచించారు...

ప్రీ ప్రైమరీ విద్యపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్..
Sanjay Kasula
|

Updated on: Aug 17, 2020 | 8:34 PM

Share

ప్రీ ప్రైమరీ విద్యపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. అంగన్‌వాడీ కేంద్రాలకు అనుబంధంగా వీటిని నిర్వహించాలని సూచించారు. అంగన్‌ వాడీ కేంద్రాల్లోనూ నాడు – నేడును చేపట్టాలని స్పష్టం చేశారు. 4 వేల కోట్ల రూపాయలతో అంగన్‌వాడీల్లో నాడు–నేడు కింద అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది.

ఇకపై వైఎస్సార్‌ ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా అంగన్‌ వాడీ కేంద్రాలు రూపుదిద్దుకోనున్నాయి. ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ ‌రెడ్డి ప్రీ ప్రైమరీ పాఠశాలల‌పై సమీక్ష నిర్వహించారు.

సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ… అంగన్‌వాడీల్లో పాఠ్య ప్రణాళిక-ఒకటో తరగతి పాఠ్య ప్రణాళికతో ట్రాన్సిషన్‌ ఉండాలని అన్నారు. ప్రీ ప్రైమరీకి ప్రత్యేక పాఠ్య ప్రణాళిక, విద్యాశాఖకు తయారీ బాధ్యతను అప్పగించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అంగన్‌వాడీ టీచర్లకు డిప్లమో కోర్సు ఉంటుందన్నారు. బోధనా పద్దతులు, పాఠ్య ప్రణాళిక, సులభమైన మార్గాల్లో పిల్లలకు విద్యా బోధనపై వారికి ట్రైనింగ్‌ ఇవ్వాలని సూచించారు.

నాడు– నేడు కింద అంగన్‌వాడీల అభివృద్ధి, కొత్త వాటి నిర్మాణం జరుగుతుందని… అంగన్‌వాడీ కేంద్రాలలో పరిశుభ్రమైన తాగునీరు, బాత్‌రూమ్స్ ఏర్పాటు చేయాలని అన్నారు.‌ నాడు-నేడు కింద స్కూళ్లకు ఇప్పుడు ఇస్తున్న సదుపాయాలన్నీ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సీఎం అమ్మ ఒడి ద్వారా విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకువచ్చామని అన్నారు.

Follow Us
మీ మాటే శాసనం.. ఈ రాశివారే మార్చి నెల కింగ్‌లు.. మీ రాశి ఉందా..?
మీ మాటే శాసనం.. ఈ రాశివారే మార్చి నెల కింగ్‌లు.. మీ రాశి ఉందా..?
రైలులో ఇలాంటి వస్తువులు తీసుకెళ్తే జైలు పాలే.. 9 మంది అరెస్ట్
రైలులో ఇలాంటి వస్తువులు తీసుకెళ్తే జైలు పాలే.. 9 మంది అరెస్ట్
కోట్ల ఆస్తులు వదిలేసి పల్లెటూరిలో ఉంటున్న స్టార్ హీరో..
కోట్ల ఆస్తులు వదిలేసి పల్లెటూరిలో ఉంటున్న స్టార్ హీరో..
తెలంగాణ పీజీఈసెట్‌ 2026 నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తు తేదీలు ఇవే
తెలంగాణ పీజీఈసెట్‌ 2026 నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తు తేదీలు ఇవే
మాజీ వార్డు మెంబర్ దారుణ హత్య !
మాజీ వార్డు మెంబర్ దారుణ హత్య !
200 కి.మీ వేగంతో ప్రయాణించే దేశంలోనే మొట్టమొదటి రైలు..
200 కి.మీ వేగంతో ప్రయాణించే దేశంలోనే మొట్టమొదటి రైలు..
మరో ఛాన్స్.. CUET UG 2026కి మళ్లీ తెరచుకున్న అప్లికేషన్ విండో
మరో ఛాన్స్.. CUET UG 2026కి మళ్లీ తెరచుకున్న అప్లికేషన్ విండో
ఈ క్యూట్ బ్రదర్స్ ఇప్పుడు టాలీవుడ్‌ ఫేమస్ హీరోస్..గుర్తు పట్టారా?
ఈ క్యూట్ బ్రదర్స్ ఇప్పుడు టాలీవుడ్‌ ఫేమస్ హీరోస్..గుర్తు పట్టారా?
బాబా వంగా జోస్యం.. త్వరలో కోటీశ్వరులు అయ్యే రాశులు ఇవే!
బాబా వంగా జోస్యం.. త్వరలో కోటీశ్వరులు అయ్యే రాశులు ఇవే!
రహస్య ప్రేమికులు కన్య రాశి.. ఈ రాశివారితో జత కడితే మీ లైఫ్ హ్యాపీ
రహస్య ప్రేమికులు కన్య రాశి.. ఈ రాశివారితో జత కడితే మీ లైఫ్ హ్యాపీ