ఆదర్శన పాలన సాగించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా నేతగా మన్ననలందుకుంటున్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఆప్తుడిగా మారి నేనున్నాని ముందుకు దూసుకుపోతున్నారు. ప్రజాసంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు చేయూతనందిస్తున్నారు. తనదైన తరహాపాలనతోపాటు తన వద్దకు వచ్చేవారిని చిరునవ్వుతో పలకరిస్తుంటారు.
ఇక ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతిని సందర్భంగా ఇడుపులపాయ లో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రితోపాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.
ఇదే కార్యక్రమంకు వచ్చిన అభిమానులను ప్రత్యేకంగా సీఎం జగన్ పలకరించారు. వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అయితే ఈక్రమంలోనే జ్యోతి అనే మహిళా అభిమాని సీఎం జగన్ దంపతులను కలుసుకుని తన బాబును ఆశీర్వదించాలని కోరారు. దీంతో వెంటనే ఆ చిన్నారిని చేతుల్లోకి తీసుకుని ఆశీర్వదించారు సీఎం వైఎస్ జగన్ దంపతులు. ముఖ్యమంత్రి స్వయంగా తమ బిడ్డను ఆశీర్వదించడంతో చిన్నారి తల్లిదండ్రులు మురిసిపోయారు. వారితో కలిసి ఓ ఫోటోను కూడా దిగారు.