మంత్రులపై సోము వీర్రాజు హాట్ కామెంట్: ఉత్సవాల్లో కరపత్రాలు పంచే క్రైస్తవ ప్రచారకుల మాదిరిగా మారిపోయారని వ్యాఖ్య

|

Dec 25, 2020 | 2:33 PM

హిందు ధార్మిక క్షేత్రాల్లో పవిత్రతను వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు మంటగలుపుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు..

మంత్రులపై సోము వీర్రాజు హాట్ కామెంట్: ఉత్సవాల్లో కరపత్రాలు పంచే క్రైస్తవ ప్రచారకుల మాదిరిగా మారిపోయారని వ్యాఖ్య
Follow us on

హిందు ధార్మిక క్షేత్రాల్లో పవిత్రతను వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు మంటగలుపుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. మత విస్తరణ కోసం ఉత్సవాల్లో కరపత్రాలు పంచే క్రైస్తవ ప్రచారకుల మాదిరిగా మంత్రులు మారిపోయారని విమర్శలు గుప్పించారు. చర్చికి వెళ్లి ఈ మంత్రులు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు చెప్పగలరా..? అని సోము ప్రశ్నించారు. “ధార్మిక క్షేత్రాల్లో అసలు ప్రభుత్వ పథకాల గురించి ప్రస్తావించకూడదు.. కానీ మంత్రులు ఇళ్ల పట్టాల గురించి తిరుమలలో ప్రస్తావించారు. ముఖ్యమంత్రి ఈ ఘటనపై విచారణ జరిపించాలి”. అని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ప్రకటించిన ఇళ్ల నిర్మాణాల్లో అవినీతి జరిగిందన్న ఆయన, కేంద్రం ఏపీకి 23 లక్షల ఇళ్ల నిర్మాణాలకు నిధులు ఇచ్చిందని స్పష్టం చేశారు.