AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రిజర్వేషన్ల అమలుపై.. గవర్నర్ కు కన్నా లేఖ..

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచదేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం 10% ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లను

రిజర్వేషన్ల అమలుపై.. గవర్నర్ కు కన్నా లేఖ..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 18, 2020 | 5:22 PM

Share

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచదేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం 10% ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లను అమలు చేయకపోవడంపై మీరు జోక్యం చేసుకోవాలని కన్నా కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తీరు వల్ల కేంద్ర ప్రభుత్వం అందించిన 10% రిజర్వేషన్లను కోల్పోతున్నారని, రాష్ట్రంలో ఆర్థికంగా బలహీనమైన వర్గాల వారంతా నష్టపోతున్నారని కన్నా అన్నారు. దేశంలోని ఉన్నత కులాల ప్రజలు ఆర్థికంగా బలహీనమైన వర్గాల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం ఇదన్నారు.

అయితే.. రాష్ట్ర ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను రాష్ట్రంలో అమలు చేయడం లేదని, విద్యార్థులు ఉన్నత, వృత్తి విద్యా సంస్థలలో ప్రవేశంతో పాటు ఉపాధికి అనేక అవకాశాలను కోల్పోతున్నారని కన్నా పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ విభాగాలకు చెందిన ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతున్నారని, వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి లేఖలు రాసినా .. తమ విజ్ఞప్తులను పట్టించుకోలేదని కన్నా తెలిపారు. లక్షలాది మంది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 10% రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్ ను కోరినట్లు కన్నా లేఖలో పేర్కొన్నారు.

Follow Us
ఘనంగా టాలీవుడ్ హీరోయిన్ సీమంతం.. ఎవరో గుర్తుపట్టారా? ఫొటోస్ ఇదిగో
ఘనంగా టాలీవుడ్ హీరోయిన్ సీమంతం.. ఎవరో గుర్తుపట్టారా? ఫొటోస్ ఇదిగో
ఇకపై పోలీసు వాహనాలు కూడా ఫైన్లు వేస్తాయ్ జాగ్రత్త!
ఇకపై పోలీసు వాహనాలు కూడా ఫైన్లు వేస్తాయ్ జాగ్రత్త!
5 సార్లు IVF..1000కు పైగాఇంజెక్షన్లు..ఎట్టకేలకు 'అమ్మ'గా ప్రమోషన్
5 సార్లు IVF..1000కు పైగాఇంజెక్షన్లు..ఎట్టకేలకు 'అమ్మ'గా ప్రమోషన్
యుగానుకూల మాతృత్వంపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
యుగానుకూల మాతృత్వంపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
తీవ్రమైన కాలినొప్పి అని ఆస్పత్రికి వెళ్తే..ఎక్స్‌రే చూసి వైద్యులే
తీవ్రమైన కాలినొప్పి అని ఆస్పత్రికి వెళ్తే..ఎక్స్‌రే చూసి వైద్యులే
వీళ్లు ఎల్‌నినో కంటే యమ డేంజర్‌.. పంటచేలో పచ్చి నకిలీగాళ్లు
వీళ్లు ఎల్‌నినో కంటే యమ డేంజర్‌.. పంటచేలో పచ్చి నకిలీగాళ్లు
హైదరాబాద్ వాసులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. కాచిగూడ నుంచి..
హైదరాబాద్ వాసులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. కాచిగూడ నుంచి..
నలుపు, తెలుపు, నీలం.. వాటర్ ట్యాంక్ ఏది మంచిదో తెలుసుకోండి..!
నలుపు, తెలుపు, నీలం.. వాటర్ ట్యాంక్ ఏది మంచిదో తెలుసుకోండి..!
బంగారం, వెండి కాదు.. భవిష్యత్తులో దీనిదే హవా..
బంగారం, వెండి కాదు.. భవిష్యత్తులో దీనిదే హవా..
అన్నా ఆల్ ది బెస్ట్.. 'జబర్దస్త్' నుంచి మరో డైరెక్టర్..
అన్నా ఆల్ ది బెస్ట్.. 'జబర్దస్త్' నుంచి మరో డైరెక్టర్..