
నేటి నుంచి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు సర్వం సిద్ధమైంది. ఉదయం 11.05 నిమిషాలకు సమావేశాలు ప్రారంభం కానుండగా.. ప్రొటెం స్పీకర్ అప్పలనాయుడు ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇక గురువారం స్పీకర్‌గా తమ్మినేని సీతారాంను శాసనసభ ఎన్నుకోనుంది. ఈ నెల 14న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 15,16 తేదీల్లో సభకు సెలవులు ఉండగా.. 18న అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి.
బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశాలు మొత్తం ఐదు రోజులపాటు సాగే అవకాశముంది. శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశంలో వీటిపై నిర్ణయం తీసుకుంటారు. ప్రొటెం స్పీకర్ శంబంగి చిన వెంకటఅప్పలనాయుడు తొలుత శాసన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం మిగతా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార ప్రక్రియ కొనసాగుతుంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక గురువారం జరగనుండగా, శుక్రవారం ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ప్రసంగిస్తారు.
[svt-event title=”ఏపీ అసెంబ్లీ సమావేశాలు” date=”12/06/2019,12:52PM” class=”svt-cd-green” ] అసెంబ్లీ లో సందడి వాతావరణం నెలకొంది. ఎమ్యెల్యే ల ప్రమాణ స్వీకారానికి వారి కుటుంబ సభ్యులు, కార్యకర్తలు హాజరయారు. కొత్తగా అసెంబ్లీ కి వచ్చిన ఎమ్యెల్యేలు కొత్త ఉత్సాహంతో అసెంబ్లీ లాబీలు తిరుగుతూ పరిశీలించారు. సభలోకి ముఖ్యమంత్రి అడుగుపెట్టగానే జై జగన్ అంటూ వైసీపీ ఎమ్యెల్యేలు నినాదాలు చెశారు. ప్రమాణ స్వీకారం తర్వాత ప్రతిపక్ష నేత చంద్రబాబు కు నమస్కరించిన సీఎం జగన్ కు చంద్రబాబు ప్రతి నమస్కారం చేశారు. [/svt-event]
[svt-event title=”ఏపీ అసెంబ్లీ సమావేశాలు” date=”12/06/2019,12:47PM” class=”svt-cd-green” ] సీఎం సానుకూలంగా స్పందించడం తో సమ్మె విరమణకు అంగీకరించిన ఆర్టీసీ జేఏసీ నేతలు. [/svt-event]
[svt-event title=”ఏపీ అసెంబ్లీ సమావేశాలు” date=”12/06/2019,12:46PM” class=”svt-cd-green” ] సీఎం జగన్మోహన్ రెడ్డి తో ఆర్టీసీ ఎండీ సురేంద్ర బాబు,రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు, ఆర్టీసీ జేఏసీ నాయకుల భేటీ.. [/svt-event]
[svt-event title=”ఏపీ అసెంబ్లీ సమావేశాలు” date=”12/06/2019,12:08PM” class=”svt-cd-green” ] కొనసాగుతున్న ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారోత్సవం [/svt-event]
[svt-event title=”ఏపీ అసెంబ్లీ సమావేశాలు” date=”12/06/2019,11:38AM” class=”svt-cd-green” ] ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం [/svt-event]
[svt-event title=”ఏపీ అసెంబ్లీ సమావేశాలు” date=”12/06/2019,11:14AM” class=”svt-cd-green” ] ప్రమాణ స్వీకారం చేయిస్తోన్న ప్రొటెం స్పీకర్, ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తోన్న మంత్రులు [/svt-event]
[svt-event title=”ఏపీ అసెంబ్లీ సమావేశాలు” date=”12/06/2019,11:13AM” class=”svt-cd-green” ] టీడీపీ శాసనసభ పక్ష నేతగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు [/svt-event]
[svt-event title=”ఏపీ అసెంబ్లీ సమావేశాలు” date=”12/06/2019,11:12AM” class=”svt-cd-green” ] వైసీపీ శాసనసభ పక్ష నాయకుడిగా ప్రమాణ స్వీకారం చేసిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి [/svt-event]
[svt-event title=”ఏపీ అసెంబ్లీ సమావేశాలు” date=”12/06/2019,11:09AM” class=”svt-cd-green” ] ప్రొటెం స్పీకర్‌గా బాధ్యతలు తీసుకున్న శంబంగి చినఅప్పలనాయుడు [/svt-event]
[svt-event title=”ఏపీ అసెంబ్లీ సమావేశాలు” date=”12/06/2019,11:05AM” class=”svt-cd-green” ] ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు [/svt-event]
[svt-event title=”ఏపీ అసెంబ్లీ సమావేశాలు” date=”12/06/2019,10:50AM” class=”svt-cd-green” ] అసెంబ్లీకి చేరుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి [/svt-event]