ఏపీ బడ్జెట్ అప్డేట్స్: ఏయే రంగానికి ఎంత కేటాయించారంటే..!

|

Jun 16, 2020 | 3:30 PM

వైఎస్ జగన్ ప్రభుత్వం రెండోసారి వార్షిక ఆర్ధిక బడ్జెట్ 2020-21ని ప్రవేశపెట్టింది. రూ. 2.24 లక్షల కోట్లతో సంక్షేమ బడ్జెట్‌ను ప్రభుత్వం రూపొందించింది. అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ఈ బడ్జెట్ రూపొందించారు. తెలుగు కవితతో బడ్జెట్ ప్రసంగాన్ని మొదలుపెట్టిన ఆర్ధిక మంత్రి బుగ్గన.. పేద ప్రజల కష్టాలను తీర్చడానికి నవరత్నాలను అమలు చేస్తున్నామన్నారు. కేటాయింపులు ఇలా ఉన్నాయి.. వైఎస్ఆర్ నేతన్న నేస్తం రూ. […]

ఏపీ బడ్జెట్ అప్డేట్స్: ఏయే రంగానికి ఎంత కేటాయించారంటే..!
Follow us on

వైఎస్ జగన్ ప్రభుత్వం రెండోసారి వార్షిక ఆర్ధిక బడ్జెట్ 2020-21ని ప్రవేశపెట్టింది. రూ. 2.24 లక్షల కోట్లతో సంక్షేమ బడ్జెట్‌ను ప్రభుత్వం రూపొందించింది. అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ఈ బడ్జెట్ రూపొందించారు. తెలుగు కవితతో బడ్జెట్ ప్రసంగాన్ని మొదలుపెట్టిన ఆర్ధిక మంత్రి బుగ్గన.. పేద ప్రజల కష్టాలను తీర్చడానికి నవరత్నాలను అమలు చేస్తున్నామన్నారు.

కేటాయింపులు ఇలా ఉన్నాయి..

  • వైఎస్ఆర్ నేతన్న నేస్తం రూ. 200 కోట్లు
  • వైఎస్ఆర్ మత్స్యకార భరోసా రూ. 109.75 కోట్లు..
  • జగనన్న తోడు రూ. 100 కోట్లు
  • ఇమామ్‌లు, మౌజామ్‌లకు రూ. 50 కోట్లు
  • న్యాయ నేస్తం కోసం రూ. 12.75 కోట్లు
  • జెరూసలెం పవిత్ర యాత్రకు రూ. 5 కోట్లు
  • రైతులకు వడ్డీ లేని రుణాల కోసం రూ. 11 వేల కోట్లు
  • రైతు భరోసా కేంద్రాల కోసం రూ. 100 కోట్లు
  • రియల్ టైమ్ గవర్నెన్స్ కోసం రూ. 54. 51 కోట్లు
  • ధరల స్థిరీకరణ నిధి – రూ. 3 వేల కోట్లు
  • వడ్డీ లేని రుణాల కోసం – రూ. 1,100 కోట్లు
  1. మైనారిటీ సంక్షేమానికి రూ. 2,055.63 కోట్లు
  2. ఎస్టీల సంక్షేమానికి రూ. 1,840 కోట్లు
  3. ఎస్సీల సంక్షేమానికి రూ. 7,525 కోట్లు
  4. కాపుల సంక్షేమానికి రూ. 2,845 కోట్లు
  5. బీసీల సంక్షేమానికి రూ. 23, 406 కోట్లు
  6. విద్యకు రూ. 22,604 కోట్లు
  7. వ్యవసాయ రంగానికి రూ. 11, 891 కోట్లు
  8. అభివృద్ధి పధకాలకు రూ. 84,140.78 కోట్లు
  9. వైఎస్ఆర్ రైతు భరోసాకు రూ. 3651 కోట్లు
  10. రేషన్ బియ్యానికి రూ. 3 వేల కోట్లు
  11. వైఎస్ఆర్ గృహ వసతికి రూ. 3 వేల కోట్లు
  • ఆరోగ్యశ్రీకి రూ. 2100 కోట్లు
  • వైద్య రంగానికి రూ. 11, 419 కోట్లు
  • షెడ్యూల్ తెగల సంక్షేమానికి రూ. 15, 735 కోట్లు
  • వైఎస్ఆర్ పెన్షన్ కానుక రూ. 16 వేల కోట్లు
  • వైఎస్ఆర్ ఆసరా రూ. 6300 కోట్లు
  • హోంశాఖకు రూ. 5988 కోట్లు
  • అమ్మఒడి పధకానికి రూ. 6 వేల కోట్లు
  1. జగనన్న విద్యాదీవెన కోసం రూ. 3009 కోట్లు
  2. జగనన్న వసతి దీవెన కోసం రూ. 2 వేల కోట్లు
  3. వైఎస్ఆర్ చేయూత కోసం రూ. 3 వేల కోట్లు
  4. బలహీన వర్గాల గృహ నిర్మాణం కోసం రూ. 150 కోట్లు
  5. వైఎస్ఆర్ కాపు నేస్తం రూ. 350 కోట్లు
  6. వైఎస్ఆర్ వాహనమిత్ర రూ. 275.51 కోట్లు
  7. వైఎస్ఆర్ జగనన్న చేదోడు రూ. 247.04 కోట్లు