ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేశారు అధికారులు. జులై 10 నుంచి ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 25 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక జులై 12వ తేదీన ఏపీ 20వ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో నూతన ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. గత ప్రభుత్వం ఎన్నికల నేపథ్యంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టగా.. పూర్తిస్థాయి బడ్జెట్‌ను నూతన ప్రభుత్వం ప్రతిపాదించనుంది. అయితే.. 25 రోజులు శాసన సమావేశాలు నిర్వహించడంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. ఈ బడ్జెట్ సమావేశంలో ఏ రంగానికి పెద్ద పీటవేస్తారనే దానిపై కుతూహలం నెలకొంది.