Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anupam Kher: బిక్షాటన చేస్తూ అనర్గళంగా ఇంగ్లిష్‌లో మాట్లాడి అనుపమ్ ఖేర్‌ను ఇంప్రెస్ చేసిన బాలిక.. చదివిస్తానంటున్న నటుడు

Anupam Kher: విధి ఎవరిని ఎప్పుడు ఎలా మారుస్తుందో, ఎవరిని ఏ తీరానికి చేరుస్తుందో ఎవరికీ తెలియదు.. భారత దేశంలో పుట్టి.. అనుకోని పరిస్థితుల్లో..

Anupam Kher: బిక్షాటన చేస్తూ అనర్గళంగా ఇంగ్లిష్‌లో మాట్లాడి అనుపమ్ ఖేర్‌ను ఇంప్రెస్ చేసిన బాలిక.. చదివిస్తానంటున్న నటుడు
Anupam Kher
Follow us
Surya Kala

|

Updated on: Nov 04, 2021 | 8:18 AM

Anupam Kher: విధి ఎవరిని ఎప్పుడు ఎలా మారుస్తుందో, ఎవరిని ఏ తీరానికి చేరుస్తుందో ఎవరికీ తెలియదు.. భారత దేశంలో పుట్టి.. అనుకోని పరిస్థితుల్లో బాల్యం విదేశాల్లో బిక్షాటన చేసే దిశగా ఓ బాలిక జీవితాన్ని విధి తీసుకుని వెళ్ళింది. అయితే ప్రతిభ ఉంటె అదృష్టవంతుడిని చెడిపేవారు లేరనే సామెతను ఈ అమ్మాయికి కరెక్ట్ గా సరిపోతుంది. దేశం కానీ దేశంలో బతకడం కోసం బిక్షాటన చేస్తున్న ఓ భారతీయ బాలిక అనుకోకుండా బాలీవుడ్ నటుడు అనుమాపు ఖేర్ దృష్టిలో పడింది. ఇప్పుడు బిచ్చగత్తె .. స్టూడెంట్ గా మారింది. అనుపమ్ ఖేర్ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.  వివరాల్లోకి వెళ్తే..

రాజస్థాన్ కు చెందిన ఆర్తిని విధి నేపాల్ దేశం తీసుకుని వెళ్ళింది. అయితే కుటుంబం పేదరికంతో ఉండడంతో జీవించడానికి బిక్షాటన చేయడం మొదలు పెట్టింది. అయితే ఇటీవల బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇటీవల నేపాల్ పర్యటన సందర్భంగా రాజధాని ఖాట్మండుకు వెళ్లారు. అక్కడ ఓ దేవాలయం ముందు ఆర్తిని అనుపమ్ చూశారట.  అయితే అలా చాలా మంది గుడి ముందు బిక్షాటన చేస్తూనే ఉంటారు.. కానీ ఈ అమ్మాయి అనుపమ్ దృష్టిలో ఎందుకు పడిందంటే.. అడుక్కుంటూనే ఇంగ్లిష్ అనర్గళంగా మాట్లాడుతుంది.  ఈ సందర్భంగా అనుపమ్ ఖేర్ .. ఆ బాలికది రాజస్థాన్ అని తెలుసుకున్నారు.

అప్పుడు అనుపమ్ ఖేర్ ఆమెను భారతదేశం నుండి ఎందుకు వచ్చావు అని అడిగాడు. అప్పుడు తన కుటుంబం గడవని పరిస్థితిలో ఇక్కడకు వచ్చామని.. అయితే తనకు చదువు అంటే చాలా ఇష్టం.. తనకు చదువుకునే అవకాశం కల్పించామని అనుపమ్ఎం ఖేర్ ను కోరింది.అంతేకాదు  నేను ఇప్పటి వరకూ ఏ స్కూల్ కి వెళ్ళలేదు. అయినా అందరితోనూ మాట్లాడుతూ ఇంగ్లీషు నేర్చుకున్నాను.. అయితే నాకు పాఠశాలకు వెళ్లడం చాలా ఇష్టం, నేను పాఠశాలకు వెళ్లాలనుకుంటున్నాను, దయచేసి పాఠశాలకు వెళ్లడానికి నాకు సహాయం చేయండిని అనుపమ్ ఖేర్ ను అడిగింది ఆర్తి..  నేను చదువులో కష్టపడితే నా జీవితం నా భవిష్యత్తు అంతా మారిపోతుందని నాకు తెలుసని చెప్పింది. దీంతో ఆర్తికి చదువు పట్ల ఉన్న  ఆసక్తిని గమనించిన అనుపమ్ ఖేర్ తక్షణం   ‘అనుపమ్ ఖేర్ ఫౌండేషన్’ తరుఫున ఆదుకునే ఏర్పాట్లు చేశారు. ఇక మీదట ఆమె ఏ ఇబ్బందీ లేకుండా చదువుకుంటుందని  సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ప్రస్తుతం అనుపమ్ ఖేర్‌తో ఆర్తి ఆంగ్లంలో మాట్లాడిన వీడియో ఇఫ్పుడు నెట్‌లో వైరల్ అవుతోంది.

View this post on Instagram

A post shared by Anupam Kher (@anupampkher)

Also Read:  అయోధ్యలో అంబరాన్ని అంటుతున్న దీపావళి సంబరాలు.. ప్రపంచ రికార్డు సృష్టించిన భక్తజనం