ఎరుపెక్కిన మంచు సరస్సు..అరిష్టమేనా..?
అంటార్కిటికా ఖండంలో మంచుకొండ ఎరుపెక్కింది. ఎటు చూసినా ఎర్రగా మారిన మంచుతో ఆ ప్రాంతమంతా భయానకంగా కనిపిస్తోంది. ఇక్కడ రక్తం ఎరులుగా పారిందా..? అదే నెత్తురు గడ్డకట్టిపోయిందా అన్నా సందేహాం కలుగుతోంది. ఎర్రని రక్తం రంగులోకి మారిన మంచు సరస్సు స్థానికులను సైతం భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఎరుపు రంగులోకి మారిన మంచు అంటార్కిటికాలోని మాజీ బ్రిటిష్ పరిశోధనా కేంద్రం వద్ద దర్శనమిచ్చింది. అత్యంత తక్కువ ఉష్ణోగ్రతల్లో గడ్డ కట్టిన మంచులో జీవించే మైక్రోస్కోపిక్ ఆల్గే కారణంగా ఎరుపు […]
అంటార్కిటికా ఖండంలో మంచుకొండ ఎరుపెక్కింది. ఎటు చూసినా ఎర్రగా మారిన మంచుతో ఆ ప్రాంతమంతా భయానకంగా కనిపిస్తోంది. ఇక్కడ రక్తం ఎరులుగా పారిందా..? అదే నెత్తురు గడ్డకట్టిపోయిందా అన్నా సందేహాం కలుగుతోంది. ఎర్రని రక్తం రంగులోకి మారిన మంచు సరస్సు స్థానికులను సైతం భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఎరుపు రంగులోకి మారిన మంచు అంటార్కిటికాలోని మాజీ బ్రిటిష్ పరిశోధనా కేంద్రం వద్ద దర్శనమిచ్చింది.
అత్యంత తక్కువ ఉష్ణోగ్రతల్లో గడ్డ కట్టిన మంచులో జీవించే మైక్రోస్కోపిక్ ఆల్గే కారణంగా ఎరుపు రంగులోకి మారినట్టు తెలుస్తోంది. ఈ ఎరుపు రంగులో ఉన్న మంచుకు సంబంధించిన ఫోటోలను ఓ ట్విటర్ యూజర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. షాక్‌కు గురి చేసే విధంగా ఎరుపు రంగులోకి మారిన అంటార్కిటికా మంచు.. వాతావరణ మార్పులు అరిష్టం అనే సంకేతాన్నిఇస్తోందన్నారు. మంచుతో నిండిన ఈ ఖండం చట్టూ వాతావరణం వేడెక్కుతోంది’ అంటూ కాప్షన్ పెట్టారు.
ఎరుపు రంగులోకి మారిన మంచు సరస్సు ఫోటోలను ఉక్రెయిన్ దేశ విద్యా, విజ్ఞాన మంత్రిత్వ శాఖ కూడా తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘అంటార్కిటికా ఖండంలోని మంచు.. వేసవి కాలం ఆరంభ సమయంలో మైక్రోస్కోపిక్ ఆల్గే కారణంగా ఎరుపు రంగులోకి మారుతుంది’ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఎరుపు రంగులో ఉన్న మంచు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.