AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్నారి ప్రాణాలను కాపాడిన ట్వీట్..హ్యాట్సాఫ్ టూ కేటీఆర్..

తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఆపదలో ఉన్నవారు కేటీఆర్‌కు ఓ ట్వీట్ చేస్తే చాలు.. సమస్యకు పరిష్కారం లభిస్తోందని అంతా అభిప్రాయం

చిన్నారి ప్రాణాలను కాపాడిన ట్వీట్..హ్యాట్సాఫ్ టూ కేటీఆర్..
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 01, 2020 | 12:18 PM

Share

తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఆపదలో ఉన్నవారు కేటీఆర్‌కు ఓ ట్వీట్ చేస్తే చాలు.. సమస్యకు పరిష్కారం లభిస్తోందని అంతా అభిప్రాయం. డైరక్ట్‌గా మంత్రి కేటీఆర్‌ను కలవలేని వారు.. చాలా మంది ట్విట్టర్‌ ద్వారా వారి విన్నపాలను పంచుకుంటారు. వాటిని చూసిన మంత్రి.. వెంటనే రిప్లై ఇస్తూ.. సమస్యలకు పరిష్కారం చూపిస్తూ సహాయం చేస్తుంటారు. తాజాగా మరో సారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు మంత్రి కేటీఆర్.

నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఓ చిన్నారి ప్రమాదవషాత్తు బిల్డింగ్‌పై నుంచి కింద పడింది. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో చిన్నారి తీవ్ర గాయాలపాలయ్యింది. దీంతో వెంటనే ఆ చిన్నారిని హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే బాధితులు నిరుపేద కుటుంబానికి చెందిన వారు కావడంతో.. చిన్నారి వైద్యానికి డబ్బులు కట్టలేని పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని గమనించిన ఓ యువకుడు.. మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌ ద్వారా ఈ చిన్నారి విషయాన్ని తెలియజేశారు. మెరుగైన చికిత్స కోసం ఆదుకోవాలని కోరాడు.

ఈ ట్వీట్‌ను గమనించిన కేటీఆర్.. వెంటనే చిన్నారి వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం క్యాంప్ ఆఫీస్ అధికారులు వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ రూ.3.50 లక్షలను అందజేశారు. సమయానికి చికిత్స అందించడంతో.. ప్రస్తుతం చిన్నారి క్షేమంగా ఉందని.. ట్విట్టర్‌లో పెట్టిన మా అభ్యర్థనను చూసి ఆదుకున్న మంత్రికి ధన్యవాదాలంటూ మళ్లీ ఆ యువకుడు ట్వీట్ చేశాడు. ఆ చిన్నారి చికిత్స పొందిన ఫోటోను కూడా జతచేశాడు. ఆ చిన్నారి ఫోటోను చూసిన కేటీఆర్.. “సోదరా.. ఈ రోజును పరిపూర్ణం చేశావు. చిన్నారిని సాయం చేయడం ఆనందంగా ఉంది” అంటూ రీప్లై ఇచ్చారు.

Follow Us
సమస్య పరిష్కారానికి వినూత్న నిరసన.. ఏం చేశారో చూడండి
సమస్య పరిష్కారానికి వినూత్న నిరసన.. ఏం చేశారో చూడండి
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
మతిపోగోడుతున్న మహేష్ మేనకోడలు.. జాన్వీ లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
మతిపోగోడుతున్న మహేష్ మేనకోడలు.. జాన్వీ లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
వేసిన కాసేపటికే ఆరిపోతున్న వీధి లైట్‌లు.. ఎన్ని సార్లు వేసినా..
వేసిన కాసేపటికే ఆరిపోతున్న వీధి లైట్‌లు.. ఎన్ని సార్లు వేసినా..
శుక్రుడి గ్రహ మార్పు.. ఇక లగ్జరీ జీవితం మీ సొంతం!
శుక్రుడి గ్రహ మార్పు.. ఇక లగ్జరీ జీవితం మీ సొంతం!
రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య అయితే మంచి ఫ్రెండ్ మాత్రం ఆ హీరోనే
రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య అయితే మంచి ఫ్రెండ్ మాత్రం ఆ హీరోనే
ఇంట్లో టికెట్ మర్చిపోయినా ట్రైన్లో ప్రయాణించవచ్చు.. ఎలా అంటే..?
ఇంట్లో టికెట్ మర్చిపోయినా ట్రైన్లో ప్రయాణించవచ్చు.. ఎలా అంటే..?
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే దాహం దాహం
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే దాహం దాహం
గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా తినే పకోడీ
గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా తినే పకోడీ
సిగరెట్ అలవాటు మానేయడం కష్టమా? చాలా మంది ఎందుకు ఫెయిల్‌ అవుతారంటే
సిగరెట్ అలవాటు మానేయడం కష్టమా? చాలా మంది ఎందుకు ఫెయిల్‌ అవుతారంటే