
కరోనా పరీక్షల నిర్వహణలో ఏపీ ప్రభుత్వం మరో రికార్డును క్రియేట్ చేసింది. ప్రతీ రోజూ 12 వేలకు పైగా కరోనా టెస్టులు నిర్వహిస్తూ దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. అటు పరీక్షల నిర్వహణతో పాటుగా జిల్లాల వారీగా ప్రజలకు మెరుగైన ఆరోగ్య సదుపాయాలన్నీ అందిస్తున్నట్లు ఏపీ కరోనా నోడల్ ఆఫీసర్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే కరోనా పరీక్షలు 3 లక్షలు దాటిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఏపీలో 3,95,681 పరీక్షలు జరగ్గా.. 3,91,890 కరోనా నెగటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. కాగా, రికవరీ రేటు విషయంలో కూడా ఏపీ గణాంకాలు భేష్‌గా ఉన్నాయని చెప్పాలి.
కరోనా కేసుల్లో దేశ రికవరీ రేటు 48 శాతం ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా 45 శాతం ఉంది. అయితే ఏపీ మాత్రం చాలా మెరుగ్గా 69 శాతం రికవరీ రేటు ఉందని ఏపీ కరోనా నోడల్ ఆఫీసర్ తెలిపారు. ఇక రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 3,200 నమోదు కాగా, అందులో యాక్టివ్ కేసులు 927 ఉన్నాయి. ఇక 2209 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, 64 మంది ప్రాణాలు కోల్పోయారు.
Also Read: ఏపీలో కొన్ని స్టేషన్లలోనే ఆగనున్న రైళ్లు.. వారికి డబ్బులు రీఫండ్..
As of today, 69% out of total #COVID19 patients recorded in AP have recovered and been discharged. This is more than 20% of the global recovery rate of 45%. #APFightsCorona #StayHomeStaySafe pic.twitter.com/fieL0clew0
— ArogyaAndhra (@ArogyaAndhra) June 2, 2020
#COVIDUpdates: as on 02/06/2020
Total positive cases: 3200
Discharged: 2209
Deceased: 64
Active cases: 927#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/v61FXsiKcP— ArogyaAndhra (@ArogyaAndhra) June 2, 2020