AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో ఘనత సాధించిన డీఆర్‌డీవో

హైదరాబాద్‌కు చెందిన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) మరో ఘనత సాధించింది. సరిహద్దు రక్షణను బలోపేతంచేసే దిశగా మరో కీలక టెక్నాలజీని ఆవిష్కరించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో సుమారు ఏడు టన్నుల వరకు బరువున్న వాహనాలను విమానాల ద్వారా తరలించగలిగే ‘పీ7 హెవీ డ్రాప్‌ సిస్టం’ను రూపొందించినట్లు డీఆర్‌డీవో అధికారులు వెల్లడించారు.

మరో ఘనత సాధించిన డీఆర్‌డీవో
Balaraju Goud
|

Updated on: Jul 17, 2020 | 5:39 PM

Share

హైదరాబాద్‌కు చెందిన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) మరో ఘనత సాధించింది. సరిహద్దు రక్షణను బలోపేతంచేసే దిశగా మరో కీలక టెక్నాటజీని ఆవిష్కరించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ సిస్టమ్ ద్వారా ఆర్మీకి ఎంతగానో ఉపయోగపడుతుందని డీఆర్‌డీవో అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. సుమారు ఏడు టన్నుల వరకు బరువున్న వాహనాలను విమానాల ద్వారా తరలించగలిగే ‘పీ7 హెవీ డ్రాప్‌ సిస్టం’ను రూపొందించినట్లు డీఆర్‌డీవో అధికారులు వెల్లడించారు. ఐఎల్‌-76 విమానాల్లో ఈ వ్యవస్థను ఉపయోగించవచ్చున్నారు. మేకిన్‌ ఇండియాలో భాగంగా దీనిని అభివృద్ధి చేసినట్టు డీఆర్డీవో వర్గాలు తెలిపాయి. ఆర్మీ, వైమానిక దళం, డీఆర్డీవోకు చెందిన ఏరియల్‌ డెలివరీ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఏడీఆర్డీఈ) ప్రతినిధులు ఆగ్రాలో ఈ వ్యవస్థకు ప్రయోగాత్మకంగా పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. గంటకు 280 కిలోమీటర్ల వేగంతో 600 మీటర్ల ఎత్తులో వెళ్తున్న ఐఎల్‌-76 విమానం ద్వారా ఏడు టన్నుల బరువును జారవిడిచి ట్రయల్స్ నిర్వహించారు. సామగ్రి సురక్షితంగా ఉపరితలానికి చేరిందని అధికారులు తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా సరిహద్దులోని భద్రతా సిబ్బందికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. సరియైన సమయంలో భారీ సామాగ్రి చేర్చేందుకు వీలవుతుందంటున్నారుడీఆర్‌డీవో అధికారులు.