ఏపీలో నేటి నుంచి.. మరో 535 మద్యం షాపులు మూసివేత..!

| Edited By:

Jun 01, 2020 | 11:06 AM

కోవిద్-19 విజృంభిస్తోంది. ఇప్పుడు భారత్ లో విలయతాండవం చేస్తోంది. లాక్ డౌన్ సడలింపులతో ప్రజా జీవనం తిరిగి ప్రారంభమయింది. అయితే.. ఇటీవల తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఏపీలో మరో 535

ఏపీలో నేటి నుంచి.. మరో 535 మద్యం షాపులు మూసివేత..!
Follow us on

Liquor shops in AP: కోవిద్-19 విజృంభిస్తోంది. ఇప్పుడు భారత్ లో విలయతాండవం చేస్తోంది. లాక్ డౌన్ సడలింపులతో ప్రజా జీవనం తిరిగి ప్రారంభమయింది. అయితే.. ఇటీవల తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఏపీలో మరో 535 మద్యం షాపులను ఎక్సైజ్‌ శాఖ తగ్గించింది. సోమవారం నుంచి ఇది అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3500 షాపులు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 2965కి తగ్గనుంది.

కాగా.. గతంలో మొత్తం 4,380 మద్యం షాపులు ఉండగా.. గత ఏడాది ఆగస్టులో వాటిని 3,500కి తగ్గించింది. తాజాగా ఈ షాపుల సంఖ్యను 2,965కి తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత 20 శాతం, ఇప్పుడు మరో 13 శాతం తగ్గించింది. దీంతో మొత్తం 33శాతం తగ్గించినట్లైంది. పదమూడు శాతం తగ్గింపును జిల్లాల వారీగా చేశారు. మద్య నిషేధం లక్ష్యమని చెబుతున్న ప్రభుత్వం అందులో భాగంగానే షాపులను తగ్గించినట్లు చెబుతోంది.

Also Read: తెలంగాణలో జులై 1 నుంచి పాఠశాలలు ప్రారంభం.. మార్గదర్శకాలు ఇవే!