Update: తెలంగాణలో జులై 1 నుంచి పాఠశాలలు ప్రారంభం.. మార్గదర్శకాలు ఇవే.. అని ప్రభుత్వం చెప్పలేదు!

Update: తెలంగాణలో జులై 1 నుంచి పాఠశాలలు ప్రారంభం.. మార్గదర్శకాలు ఇవే..! అని ఇంతకముందు చేసి పోస్ట్‌లో జులై 1 నుంచి తొలుత ఉన్నత పాఠశాలలను ప్రారంభిస్తారు. ఆగస్టు 1 నుంచి ప్రాథమిక పాఠశాలలను తెరుస్తారని రాశాం. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇటువంటి మార్గదర్శకాలను విడుదల చేసినట్లుగా ఎక్కడా కూడా అధికారిక ప్రకటన రాలేదు. అటు 30 జూన్ 2020 వరకు లాక్ డౌన్ ని పొడిగిస్తూ తాజాగా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో కూడా […]

Update: తెలంగాణలో జులై 1 నుంచి పాఠశాలలు ప్రారంభం.. మార్గదర్శకాలు ఇవే.. అని ప్రభుత్వం చెప్పలేదు!
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jun 02, 2020 | 12:08 PM

Update: తెలంగాణలో జులై 1 నుంచి పాఠశాలలు ప్రారంభం.. మార్గదర్శకాలు ఇవే..! అని ఇంతకముందు చేసి పోస్ట్‌లో జులై 1 నుంచి తొలుత ఉన్నత పాఠశాలలను ప్రారంభిస్తారు. ఆగస్టు 1 నుంచి ప్రాథమిక పాఠశాలలను తెరుస్తారని రాశాం. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇటువంటి మార్గదర్శకాలను విడుదల చేసినట్లుగా ఎక్కడా కూడా అధికారిక ప్రకటన రాలేదు. అటు 30 జూన్ 2020 వరకు లాక్ డౌన్ ని పొడిగిస్తూ తాజాగా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో కూడా విద్యాసంస్థల ప్రస్తావన కానీ, వాటిని ప్రారంభించడానికి మార్గదర్శకాలు కానీ ఇవ్వలేదు. అలాగే 30 మే 2020న కేంద్ర హోంశాఖ విడుదల చేసిన ఉత్తర్వుల్లో విద్యాసంస్థలను తిరిగి ప్రారంభించడంపై జూలైలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. అంతేకాకుండా తాము ఎటువంటి మార్గదర్శకాలు ఇవ్వలేదని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అధికారులు ‘టైమ్స్ అఫ్ ఇండియా’ వారితో చెప్పినట్లు ‘పీఐబీ ఇన్ తెలంగాణ’ ట్వీట్ కూడా చేసింది. అందువల్ల ఇంతకముందు మేము చేసిన పోస్టులో తెలంగాణలో జూలై 1 నుంచి పాఠశాలలు ప్రారంభం అవుతాయన్నది తప్పు అని గమనించగలరు.

కోవిద్-19 విజృంభిస్తోంది. ఇప్పుడు భారత్ లో విలయతాండవం చేస్తోంది. లాక్‌డౌన్ సడలింపులతో ప్రజా జీవనం తిరిగి ప్రారంభమయింది. అయితే.. తెలంగాణలో జులై 1 నుంచి బడులు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అనుమతి లభిస్తే రాష్ట్రంలో వాటిని యథాతథంగా అమలు చేస్తారు.

వివరాల్లోకెళితే.. విద్యాశాఖ మార్గదర్శకాల ప్రకారం.. జులై 1 నుంచి తొలుత ఉన్నత పాఠశాలలను ప్రారంభిస్తారు. ఆగస్టు 1 నుంచి ప్రాథమిక పాఠశాలలను తెరుస్తారు. ఒక తరగతి గదిలో 15 మంది పిల్లలకు మించి అనుమతించరు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉన్నవారిని క్లాసులకు అనుమతించరు. ప్లే గ్రౌండ్‌లో ఆటలకు అనుమతించరు. భౌతిక దూరం తప్పనిసరి. 2020-21 విద్యాసంవత్సరంలో పదో తరగతి పరీక్షలను ఏడు పేపర్లకు కుదించింది. అంటే, ఇకపై ఒక్కో సబ్జెక్టుకు ఒక పరీక్ష మాత్రమే.

కాగా.. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో విద్యార్థులు ఎక్కువగా ఉంటారు కాబట్టి, షిఫ్ట్ పద్ధతిలో తరగతులు నిర్వహిస్తారు. ప్రాథమిక పాఠశాలలో ఆది, సోమవారాలు సెలవు. రెండో శనివారం సెలవు ఉండదు. ఈ ఒక్క విద్యా సంవత్సరానికి ప్రాథమిక పాఠశాల సిలబస్‌ను 70 శాతానికి తగ్గిస్తారు. అలాగే, మొత్తం పనిదినాలను 150 రోజులకు తగ్గించింది ప్రభుత్వం. 8, 9, 10 తరగతుల విద్యార్థుల సంఖ్య 15 మందికి మించితే షిఫ్ట్ విధానంలో తరగతులు నిర్వహిస్తారు. వీరికి ఆదివారం మాత్రమే సెలవు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!