మరో మూడు బ్యాంకుల విలీనం?

| Edited By:

Apr 30, 2019 | 6:02 PM

కేంద్రం ప్రభుత్వం బ్యాంకులను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే దేనా, విజయ, బ్యాంక్ ఆఫ్ బరోడాల విలీన ప్రక్రియను పూర్తి చేసిన కేంద్రం ఇప్పుడు మళ్లీ మరో మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులను ఒకటిగా చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ప్రభుత్వ బ్యాంకులకు విలీనానికి సంబంధించిన కబురు పంపించనుందని ఆర్థిక శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఈసారి వీలినం అయ్యే బ్యాంకుల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ […]

మరో మూడు బ్యాంకుల విలీనం?
Banks privatisation
Follow us on

కేంద్రం ప్రభుత్వం బ్యాంకులను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే దేనా, విజయ, బ్యాంక్ ఆఫ్ బరోడాల విలీన ప్రక్రియను పూర్తి చేసిన కేంద్రం ఇప్పుడు మళ్లీ మరో మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులను ఒకటిగా చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.

కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ప్రభుత్వ బ్యాంకులకు విలీనానికి సంబంధించిన కబురు పంపించనుందని ఆర్థిక శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఈసారి వీలినం అయ్యే బ్యాంకుల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండొచ్చని పేర్కొన్నారు.

ఈ మూడు బ్యాంకుల విలీనానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు లేదా మూడో త్రైమాసికంలో ఈ బ్యాంకుల విలీనం జరగొచ్చని అంచనా వేశారు. అయితే బ్యాంకుల విలీనానికి ఇది సరైన సమయం కాదని ప్రభుత్వ రంగ బ్యాంక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు.