అమెరికాలో ఉద్యోగాల‌పై కోవిడ్ దెబ్బ‌…లెక్క‌లు చూస్తే షాక్…

|

Jul 09, 2020 | 8:47 PM

కోవిడ్-19 వ‌చ్చి ప్ర‌పంచం మొత్తాన్ని సంక్షోభంలోకి నెట్టింది. అన్ని రంగాలు ఈ ప్ర‌మాద‌క‌ర వైర‌స్ దెబ్బ‌కు కుదేల‌య్యాయి. ఎంతో మంది ఉద్యోగాలు పొగొట్టుకున్నారు.

అమెరికాలో ఉద్యోగాల‌పై కోవిడ్ దెబ్బ‌...లెక్క‌లు చూస్తే షాక్...
Follow us on

కోవిడ్-19 వ‌చ్చి ప్ర‌పంచం మొత్తాన్ని సంక్షోభంలోకి నెట్టింది. అన్ని రంగాలు ఈ ప్ర‌మాద‌క‌ర వైర‌స్ దెబ్బ‌కు కుదేల‌య్యాయి. ఎంతో మంది ఉద్యోగాలు పొగొట్టుకున్నారు. అగ్ర‌రాజ్యం అమెరికాను కూడా కోవిడ్-19 బాగా డ్యామేజ్ చేసింది. అక్క‌డ నిరుద్యోగుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా ఆ లెక్క‌లు ప‌లుచ‌బ‌డ్డ‌ట్లు తెలుస్తోంది. లేబ‌ర్ డిపార్ట్మెంట్ గురువారం విడుదల చేసిన లెక్క‌ల‌ ప్రకారం, దేశవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు సంఖ్య‌ పెరిగినప్పటికీ, గత వారం మొదటిసారిగా నిరుద్యోగులు కింద దరఖాస్తు పెట్టుకున్న‌వారి సంఖ్య స్వ‌ల్పంగా త‌గ్గింది. గ‌త వారం మరో 1.3 మిలియన్ల మంది తాము నిరుద్యోగుల‌మ‌ని పేర్కొన్నారు. మహమ్మారి మార్చి మధ్యలో ప్రారంభమైనప్పటి నుండి ప్రతి వారం కొత్త నిరుద్యోగ దాఖలు సంఖ్య ఒక మిలియన్ పైనే ఉంది. ఆ సంఖ్య గత నాలుగు వారాలలో సగటు లెక్క‌గ‌డితే 1.4 మిలియన్లు.

కాగా అదనంగా, అంటువ్యాధి నిరుద్యోగ సహాయం కార్యక్రమం కింద సాయం కోరుతూ మరో ఒక‌ మిలియన్ ప్ర‌జలు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఈ స్కీమ్ కార్మికులు, స్వయం ఉపాధి సంఘాలు, కాంట్రాక్టర్లకు ప్రయోజనాలను అందిస్తుంది. జూన్ చివరినాటికి నిరంతరం ప్రయోజనాలను పొందుతున్న వారి సంఖ్య 18.1 మిలియన్ల మంది. జూన్ మూడ‌వవారంలో ఈ సంఖ్య‌ 19.3 మిలియన్లుగా ఉంది.