పర్వేజ్ ముషారఫ్‌కు మరణశిక్ష విధిస్తూ పెషావర్ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పుకు.. పెషావర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ వకార్ అహ్మద్ సేథ్ నేతృత్వం వహించారు. ఈ ఘటనపై స్పందించారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. కాగా.. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. ‘మతిస్థిమితం లేని న్యాయమూర్తిని తొలగించాల్సిందిగా సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్‌ను’ కోరనున్నట్లు ప్రకటించారు. అలాగే ఉరిశిక్ష తీర్పుపై అప్పీల్ చేయాలని కూడా పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. కాగా.. ముషారఫ్‌కు బాసటగా పాక్ సైన్యం కూడా ఖండించింది. ఈ తీర్పు మానవత్వం, మత, నాగరిక, నైతిక విలుకలను విరుద్ధంగా ఉందని పేర్కొంది.