ఏపీ ప్రజలకు ‘కూల్’ న్యూస్.. 3 రోజుల పాటు వర్షాలు..!

ఏపీలో గ‌త వారం రోజులుగా ఎండ‌లుగా మండిపోతున్నాయి. ఉమ్ ఫున్ తుఫాన్ ప్ర‌భావంతో గాలిలో తేమ శాతం ప‌డిపోవ‌డ‌మే ఈ ఎండ‌లు, వ‌డ గాల్పుల‌కు కార‌ణ‌మ‌ని వాత‌వ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. అయితే వేడి తీవ్ర‌త‌కు అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ కేంద్రం ‘చల్లని’ న్యూస్ చెప్పింది. రాబోయే 24 గంటల్లో ఏపీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. సౌత్ బే ఆఫ్ బెంగాల్, అండమాన్ సముద్రాన్ని ఆనుకుని ఉన్న బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లోని కొన్ని ఏరియాల్లో రాబోయే 24 […]

ఏపీ ప్రజలకు ‘కూల్’ న్యూస్.. 3 రోజుల పాటు వర్షాలు..!

Updated on: May 26, 2020 | 9:16 PM

ఏపీలో గ‌త వారం రోజులుగా ఎండ‌లుగా మండిపోతున్నాయి. ఉమ్ ఫున్ తుఫాన్ ప్ర‌భావంతో గాలిలో తేమ శాతం ప‌డిపోవ‌డ‌మే ఈ ఎండ‌లు, వ‌డ గాల్పుల‌కు కార‌ణ‌మ‌ని వాత‌వ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. అయితే వేడి తీవ్ర‌త‌కు అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ కేంద్రం ‘చల్లని’ న్యూస్ చెప్పింది. రాబోయే 24 గంటల్లో ఏపీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. సౌత్ బే ఆఫ్ బెంగాల్, అండమాన్ సముద్రాన్ని ఆనుకుని ఉన్న బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లోని కొన్ని ఏరియాల్లో రాబోయే 24 గంటల్లో నైఋతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వివ‌రించింది. దక్షిణ చత్తీస్‌గఢ్ నుంచి ఇంటీరియర్ తమిళనాడు వరకు… తెలంగాణ, రాయలసీమ మీదుగా 0.9 కిమీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీంతో ఏపీలోని ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో మంగళవారం, బుధ, గురు వారాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వాన‌లు కురిసే ఛాన్స్ ఉన్న‌ట్లు తెలిపింది.

అలాగే దక్షిణ కోస్తాంధ్రాలో రానున్న‌ మూడు రోజుల్లో కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వాన‌లు కురిసే అవకాశం ఉందని వివ‌రించింది. ఇక‌ గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీ సెల్సియస్‌ నుంచి 43 డిగ్రీ సెల్సియస్ రికార్డ‌య్యే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల‌లో కూడా రానున్న రెండు రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు క‌నిపిస్తున్నాయ‌ని, గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీ సెల్సియస్‌ నుంచి 43 డిగ్రీ సెల్సియస్ వ‌ర‌కు న‌మోదయ్యే ఛాన్స్ ఉంద‌ని వాతావరణ కేంద్రం వెల్లడించింది.