Andhra Pradesh: సమ్మె సైరన్ మోగించిన ఏపీ జూడా అసోసియేషన్.. నేటి నుంచి నిరసన కార్యక్రమాలు..

|

Dec 01, 2021 | 7:04 AM

తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఏపీ జూనియర్‌ డాక్టర్ల అసోసియేషన్‌ మరోసారి సమ్మె సైరన్‌ మోగించింది. ఈ మేరకు బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మెలోకి దిగనున్నట్లు..

Andhra Pradesh: సమ్మె సైరన్ మోగించిన ఏపీ జూడా అసోసియేషన్.. నేటి నుంచి నిరసన కార్యక్రమాలు..
Follow us on

తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఏపీ జూనియర్‌ డాక్టర్ల అసోసియేషన్‌ మరోసారి సమ్మె సైరన్‌ మోగించింది. ఈ మేరకు బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మెలోకి దిగనున్నట్లు.. డిసెంబర్ 9 వరకు వివిధ దశల్లో  నిరసనలు చేపడతామంటూ  ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. తమకు ఇస్తున్న స్టైఫండ్‌లో 10 శాతం ట్యాక్స్ కట్ చేస్తున్న విధానాన్ని జూడాలు తప్పుపడుతున్నారు. సెక్షన్ 10 (16) కింద స్టైఫండ్‌ను స్కాలర్ షిప్‌గా పరిగణించి ట్యాక్స్ కట్ చేయకూడదని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా త్వరితగతిన నీట్ పీజీ కౌన్సెలింగ్‌ నిర్వహించి మరికొంతమందిని నియమించుకోవాలని మరొక డిమాండ్ చేస్తున్నారు.

సమ్మెలో భాగంగా బుధవారం ఆస్పత్రుల వద్ద నల్ల బ్యాడ్జీలతో జూడాలు నిరసనకు దిగనున్నారు. డిసెంబర్ 2న సంబంధిత కళాశాలల వద్ద క్యాండిల్‌ లైట్ మార్చ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 3న జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులకు లేఖలు సమర్పించనున్నారు. డిసెంబర్ 4న ట్విట్టర్ తుఫాను, మాస్ మెయిలింగ్ రూపంలో సోషల్ మీడియాలో విస్తృత క్యాంపెయిన్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 5న హాస్పిటల్స్‌లో OPD (అవుట్‌ పేషెంట్‌ డిపార్ట్‌మెంట్‌) సేవలతో పాటు డిసెంబర్ 7 నుంచి ఐచ్ఛిక సేవలను నిలిపివేయనున్నారు. డిసెంబర్ 9 నుంచి అత్యవసర సేవలను కూడా నిలిపివేయనున్నట్లు జూడాలు సమ్మె నోటీస్‌లో పేర్కొన్నారు.

Also Read:

Andhra Pradesh: పెళ్లి అయి పది రోజులు కూడా అవలేదు.. బాత్‌రూమ్‌ వెళ్తానని చెప్పి వెళ్లిన నవ వధువు..

Crypto Games: ఆడండి.. క్రిప్టో కరెన్సీ గెలుచుకోండి.. ఎలా.. ఎక్కడ ఆడాలో తెలుసా..

Liquor Mafia: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంటే ఇదేమరి.. నాటు సారా ఎక్కడ దాచారో తెలిస్తే అవాక్కవుతారు..!