వైస్ ఛాన్సలర్లతో ఏపీ గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్

కరోనా మహమ్మారి పుణ్యమాని విద్యా వ్యవస్థ రూపురేఖలే మారిపోయాయి. విద్యార్థులకు పరీక్షలు లేకుండా ఉత్తర్ణత చేస్తున్నాయి ప్రభుత్వాలు. అయితే విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా అనుసరించాల్సిన విధానంపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లతో చర్చించారు.

వైస్ ఛాన్సలర్లతో ఏపీ గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్

Updated on: Jul 17, 2020 | 2:58 PM

కరోనా మహమ్మారి పుణ్యమాని విద్యా వ్యవస్థ రూపురేఖలే మారిపోయాయి. విద్యార్థులకు పరీక్షలు లేకుండా ఉత్తర్ణత చేస్తున్నాయి ప్రభుత్వాలు. అయితే విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా అనుసరించాల్సిన విధానంపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లతో చర్చించారు.

రాష్ట్రంలోని 20 యూనివర్సిటీల ఉపకులపతులతో రాజభవన్ నుంచి గవర్నర్ విశ్వభూషన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కోవిడ్ 19 మూలంగా ‘ఉన్నత విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్ళు – నివారణ మార్గాలు’ అనే అంశంపై చర్చించారు. కరోనా కేసులు పెరుగుతుండడం, రెగ్యులర్ తరగతులు నిర్వహించలేకపోవడం, యూజీసీ ఆదేశాల మేరకు తుది సంవత్సర పరీక్షలు నిర్వహణకు అనుసరించాల్సిన వ్యుహంపై చర్చించారు. ఇకపై విద్యాసంవత్సరం ఎలా ముందుకు తీసుకు వెళ్లడంపై గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్, రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కె హెమచంద్రారెడ్డి, గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాలు పాల్గొన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us