
రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణలో తాజాగా మరో 92 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావడంతో.. మొత్తంగా బాధితుల సంఖ్య 3,742కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కారణంగా 142 మంది మరణించారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,813కు చేరుకోగా.. వాటిలో 13 జిల్లాలలో 3843 కేసులు, విదేశాల నుంచి వచ్చిన 132 కేసులు, వలస కూలీలకు చెందిన 838 కేసులున్నాయి.
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. సోమవారం ఒక్కరోజే రాష్ట్రంలో కొత్తగా 92 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అటు వైరస్ కారణంగా ఐదు మరణాలు సంభవించినట్లు ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీనితో మొత్తంగా రాష్ట్రంలో 3,742 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 142 మరణాలు సంభవించాయి.
అటు ఏపీలో కరోనా కోరలు చాస్తోంది. సోమవారం కొత్తగా 154 కేసులు నమోదయ్యాయి. వాటిలో వివిధ జిల్లాల్లో 125 కేసులు, విదేశాలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో కొత్తగా 29 కేసులు వచ్చాయి. దీనితో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4,813కు చేరుకుంది. అటు మరణాల సంఖ్య 75కు చేరింది. కాగా, ఏపీలో ఇప్పటివరకు 4లక్షల 50వేలపైనే కరోనా టెస్ట్‌లను ప్రభుత్వం నిర్వహించింది.
Also Read:
ఏపీ వెళ్ళాలనుకునేవారికి ముఖ్య గమనిక.. జగన్ సర్కార్ కీలక ప్రకటన..
నిరుద్యోగులకు శుభవార్త.. గురుకులాల్లో టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..