వారికి త‌క్ష‌ణ సాయంగా రూ.2 వేలు : ఏపీ స‌ర్కార్ ఉత్త‌ర్వులు

అల్ప‌పీడ‌న ప్ర‌భావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి, ఈ ప్ర‌భావంతో వాగులు, వంక‌లు పొంగి పొర్ల‌తున్నాయి. ప‌లు గ్రామాలు నిలిచిపోయాయి.

వారికి త‌క్ష‌ణ సాయంగా రూ.2 వేలు : ఏపీ స‌ర్కార్ ఉత్త‌ర్వులు
Follow us

|

Updated on: Aug 19, 2020 | 7:16 AM

అల్ప‌పీడ‌న ప్ర‌భావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి, ఈ ప్ర‌భావంతో వాగులు, వంక‌లు పొంగి పొర్ల‌తున్నాయి. ప‌లు గ్రామాలు నిలిచిపోయాయి. పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లోని గోదావరి నదీ తీరప్రాంతాల్లోకి వరదనీరు వ‌చ్చి చేరింది. దీంతో అధికారులు ఆ ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లించారు.

కాగా వ‌ర‌ద బాధితులకు రూ.2 వేల తక్షణ సాయాన్ని ఏపీ స‌ర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. గోదావరి వరద ప్రభావాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన సీఎం జ‌గ‌న్ తక్షణ సాయంగా రెండు వేల రూపాయలు ప్రకటించారు. ఈ మేరకు బాధితులకు చెల్లించాల్సిందిగా.. గ‌వ‌ర్న‌మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర సరకులు ఇవ్వటంతోపాటు షెల్టర్లలోనూ భోజనానికి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వం సూచించింది. ఖ‌ర్చు విష‌యంలో అస్స‌లు వెన‌క్కి త‌గ్గొద్ద‌ని, బాధితులంద‌రికీ మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించాల‌ని సీఎం అధికారుల‌కు చెప్పారు. ప్ర‌జాప్ర‌తినిథుల‌ను, నాయ‌కుల‌ను స‌హాయ‌క చ‌ర్య‌ల్లో భాగం అవ్వాల‌ని సూచించారు.

Also Read :

విచిత్రం : ఉరుములు, మెరుపులు లేకుండానే ప‌డ్డ‌ పిడుగు

వైఎస్సార్‌ జగనన్న కాలనీ మోడ‌ల్ హౌస్‌లు రెడీ