Ananya Pandey In Sarkar Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్‌లో ‘సర్కార్ వారి పాట’ అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కీర్తి సురేష్ మెయిన్ హీరోయిన్‌గా నటించనున్న ఈ మూవీలో సెకండ్ హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.
ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ నెల 9న సూపర్ స్టార్ మహేశ్ బర్త్ డే పురస్కరించుకుని చిత్రంలోని టైటిల్ పాటను విడుదల చేయబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే అనన్య పాండే ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ‘ఫైటర్’ సినిమాలో నటిస్తోంది. మహేష్ పక్కన నటించే ఆఫర్ వస్తే మాత్రం టాలీవుడ్‌లో ఆమె దశ తిరిగినట్లేనని చెప్పాలి. కోవిడ్ 19 ప్రభావం తగ్గిన తర్వాత చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.