Amrutham Serial: ‘అమృతం 2.0’ వచ్చేస్తోంది.. ఏ ఛానల్‌లో.. డేట్ ఎప్పుడంటే.?

తెలుగులో మోస్ట్ సక్సస్‌ఫుల్ సీరియల్‌గా పేరుగాంచిన 'అమృతం'కు సీక్వెల్ రానుంది. ఈ 'అమృతం 2.0' ఉగాది కానుకగా మార్చి 25న జీ5 ద్వారా అందుబాటులోకి రానుంది...

Amrutham Serial: అమృతం 2.0 వచ్చేస్తోంది.. ఏ ఛానల్‌లో.. డేట్ ఎప్పుడంటే.?

Updated on: Feb 23, 2020 | 2:42 PM

Amrutham Serial: తినగతినగ వేము తియ్యనుండు.. చూడగ చూడగా అమృతం అద్భుతంగానుండు.. విశ్వదాభిరామ.. సీరియల్స్‌నుందు అమృతం వేరురా మామ..! తెలుగులో మోస్ట్ సక్సస్‌ఫుల్ సీరియల్‌గా పేరుగాంచిన ‘అమృతం’కు సీక్వెల్ రానుంది. హర్షవర్ధన్, శ్రీమన్నారాయణ, వాసు ఇంటూరిలతో పాటు సీనియర్ నటుడు ఎల్బీ శ్రీరామ్, సత్యకృష్ణలు ఈ కొత్తదానిలో మన చేత నవ్వులు పూయించడానికి వచ్చేస్తున్నారు. ఈ ద్వితీయ భాగానికి గుణ్ణం గంగరాజు కథను అందిస్తుండగా.. సందీప్ దర్శకత్వం వహిస్తున్నాడు. లైట్ బాక్స్ మీడియా బ్యానర్ నిర్మిస్తున్న ఈ ‘అమృతం 2.0’ ఉగాది కానుకగా మార్చి 25న జీ5 ద్వారా అందుబాటులోకి రానుంది.

‘అమృతం’ సీరియల్‌లో అమృతరావు క్యారెక్టర్‌లో శివాజీరాజా, నరేష్, హర్షవర్ధన్‌లు కనిపించగా.. ఆంజనేయులు పాత్రలో గుండు హనుమంతరావు నటించి మెప్పించారు. ఆయన మరణించడంతో ఆ ప్లేస్‌లో సీనియర్ యాక్టర్ ఎల్బీ శ్రీరామ్‌ను తీసుకున్నారు. ఈ సీరియల్‌లో అంజి పాత్రకు ప్రత్యేక స్థానం ఉంది. ఆ పాత్రలో శ్రీరామ్ ఒదిగిపోతారని అందరూ అనుకుంటున్నారు. ‘అమృతం ద్వితీయం’.. మూర్ఖత్వానికి మరణం లేదు అనే క్యాప్షన్‌తో ఈ సీరియల్ వస్తోంది.

Also Read: Samantha Making Debut As Reality Host

Also Read: Whatsapp Groups Leak In Google Search

Also Read:నన్ను చంపేయ్ అమ్మా.. 9 ఏళ్ళ చిన్నారి ఆవేదన.. వీడియో వైరల్..

ఇదిలా ఉంటే అమృతం మొదటి భాగానికి ఇప్పటికే యూట్యూబ్‌లో మిలియన్స్‌లో వ్యూస్ వచ్చాయి. ఇటీవలకు జీ5 ద్వారా ఇది అందుబాటులో ఉంచినా.. ప్రేక్షాధారణ మాత్రం తగ్గలేదు. కాగా, అమృతం, అంజి, సర్వం, అప్పాజీ క్యారెక్టర్ల ఆధారంగా వస్తోన్న రెండో భాగంపై అందరిలో ఆసక్తి నెలకొంది. చూడాలి మరి ఈ ద్వితీయం ఎంతమేరకు మెప్పిస్తుందో.