అమరావతి ఆందోళనపై అమిత్‌షా నజర్: దూత ఆయనే

ఏపీలో జరుగుతున్న రాజధాని ఆందోళనపై కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్‌షా కూపీ లాగుతున్నారు. అందుకు తెలంగాణకు చెందిన ఓ బీజేపీ నేతను దూతగా ఆయన ఎంచుకున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన వచ్చినప్పట్నించి జరుగుతున్న పరిణామాలు, కొనసాగుతున్న ఆందోళనలపై ప్రైవేటు నివేదిక తెప్పించుకునేందుకు అమిత్ షా ప్రయత్నిస్తున్నారు. ఏపీ పరిణామాలపై బీజేపీ అధిష్టానంతోపాటు కేంద్ర హోం శాఖ దృష్టి సారించింది. దీనికి కోసం తెలంగాణకు చెందిన కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డిని రంగంలోకి […]

అమరావతి ఆందోళనపై అమిత్‌షా నజర్: దూత ఆయనే
Follow us
Rajesh Sharma

|

Updated on: Jan 11, 2020 | 3:01 PM

ఏపీలో జరుగుతున్న రాజధాని ఆందోళనపై కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్‌షా కూపీ లాగుతున్నారు. అందుకు తెలంగాణకు చెందిన ఓ బీజేపీ నేతను దూతగా ఆయన ఎంచుకున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన వచ్చినప్పట్నించి జరుగుతున్న పరిణామాలు, కొనసాగుతున్న ఆందోళనలపై ప్రైవేటు నివేదిక తెప్పించుకునేందుకు అమిత్ షా ప్రయత్నిస్తున్నారు.

ఏపీ పరిణామాలపై బీజేపీ అధిష్టానంతోపాటు కేంద్ర హోం శాఖ దృష్టి సారించింది. దీనికి కోసం తెలంగాణకు చెందిన కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డిని రంగంలోకి దింపారు అమిత్ షా. అధినేత ఆదేశాల మేరకు కిషన్ రెడ్డి ఏపీలో పలు చోట్ల తన పర్యటనలు ప్లాన్ చేసుకుంటున్నారు. అదే సమయంలో హైదరాబాద్‌లో వున్నప్పుడు ఏపీకి చెందిన రైతు ప్రతినిధులు, పార్టీ వర్గాలు, మరికొందరు సామాజికవేత్తలతో కిషన్ రెడ్డి భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం అమరావతి ఏరియా రైతాంగం కిషన్ రెడ్డిని కలిశారని బీజేపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

మూడు రాజధానుల ప్రతిపాదన కార్యరూపం దాల్చి, ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకునే నాటికి తమ వద్ద సమగ్ర సమాచారం వుండాలని అమిత్ షా బావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వెంటనే తగిన విధంగా వ్యూహాన్ని అమలు పరిచేలా బీజేపీ అధిష్టానం, కేంద్ర హోంశాఖ సిద్దంగా వుండాలని అమిత్ షా నిర్ణయించినట్లు చెబుతున్నారు. దానిలో భాగంగా కిషన్ రెడ్డి ఇవ్వనున్న నివేదిక లేదా ఇన్‌పుట్స్ అమిత్ షాకు ఉపయోగకరంగా వుంటాయని అంటున్నారు.