షూటింగ్‌లో పాల్గొంటున్నా..

|

Aug 24, 2020 | 12:07 PM

క‌రోనా నుంచి పూర్తిగా కోలుకున్న బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ పనిలో దిగిపోయారు. తాజాగా ఆయ‌న హోస్ట్ చేస్తున్న క్విజ్ రియాలిటీ గేమ్ షో కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి సీజ‌న్ 12 షూటింగ్‌లో పాల్గొన్నట్టు సోష‌ల్ మీడియా ద్వారా...

షూటింగ్‌లో పాల్గొంటున్నా..
Follow us on

క‌రోనా నుంచి పూర్తిగా కోలుకున్న బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ పనిలో దిగిపోయారు. తాజాగా ఆయ‌న హోస్ట్ చేస్తున్న క్విజ్ రియాలిటీ గేమ్ షో కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి సీజ‌న్ 12 షూటింగ్‌లో పాల్గొన్నట్టు సోష‌ల్ మీడియా ద్వారా తెలిపారు. లాక్ డౌన్ ముగిసి ఆన్ లాక్ 2.0లో బిగ్ బీ ఈ షోకి సంబంధించిన ప్రోమోల కోసం షూటింగ్‌లో పాల్గొన్నారు. ఆ స‌మ‌యంలోనే త‌నకి కరోనా సోకి ఉంటుంద‌ని అంతా భావించారు.

కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ కేబీసీ 12 (KBC-12) షూటింగ్ మొద‌లైంద‌ని తెలిలిపారు. తనకు కేబీసీతో 20 సంవత్సరాల అనుబంధన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. సెట్‌కి సంబంధించిన ఫోటోలను అమితాబ్ షేర్ చేశారు. తిరిగి ప‌నిలోకి వ‌చ్చాను.. నీలిరంగు పీపీఐ కిట్స్ ధ‌రించిన వారితో క‌లిసి షూటింగ్ చేస్తున్నా. 2000 సంవ‌త్స‌రంలో ప్రారంభ‌మైన మా ఈ షో ఈ ఏడాదితో 20వ  ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆశ్చ‌ర్యంగా అనిపిస్తోంది. ఇది తన జీవిత కాలం గుర్తుంటుంది అని పేర్కొన్నారు.