Amit Shah: ఢిల్లీ అల్లర్లలో గాయపడిన పోలీసులను పరామర్శించిన హోంమంత్రి అమిత్ షా.. పరిస్థితులపై ఆరా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం గాయపడిన పోలీసులను పరామర్శించి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Amit Shah: ఢిల్లీ అల్లర్లలో గాయపడిన పోలీసులను పరామర్శించిన హోంమంత్రి అమిత్ షా.. పరిస్థితులపై ఆరా

Updated on: Jan 28, 2021 | 1:47 PM

Home Minister Amit Shah Consoled: కొత్త వ్యవసాయ చ‌ట్టాల‌ను వ్యతిరేకిస్తూ.. గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీ హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ హింసాకాండలో ఓ రైతు మరణించగా.. 300మంది పోలీసులు గాయపడ్డారు. చాలా మంది తీవ్రంగా గాయపడి ఢిల్లీలోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం గాయపడిన పోలీసులను పరామర్శించి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం తిరత్ రామ్ షా ఆసుపత్రికి చేరుకొని అమిత్ షా గాయపడిన పోలీసులను పరామర్శించారు. ఈ సందర్భంగా ర్యాలీలో జరిగిన అవాంఛనీయ సంఘటనల గురించి షా పోలీసులను ఆరా తీసినట్లు సమాచారం.


ట్రాక్టర్ ర్యాలీలో చెలరేగిన హింస నేపథ్యంలో ఢిల్లీలోని అన్ని సరిహద్దు ప్రాంతాల్లో, నగరంలో భారీగా పోలీసులను మోహరించారు. నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. ఈ ఘటనపై క్రైం బ్రాంచ్ పోలీసులు 22 కేసులు నమోదు చేసి దర్యాప్తు సైతం ప్రారంభించారు. ఇప్పటికే 20మంది రైతు సంఘాల నాయకులకు లుక్ ఔట్ నోటీసులు జారీచేశారు.

Also Read:

ఇక ‘వేట’ మొదలు, రైతు నేతల కోసం లుక్ ఔట్ నోటీసులు, ఎఫ్ ఐ ఆర్ లో నటుడు దీప్ సిద్దు పేరు