ఢిల్లీలో రైతుల నిరసనపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా..

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పెత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా రైతుల నిరసనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు.

  • Shiva Prajapati
  • Publish Date - 9:26 pm, Sat, 28 November 20

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా రైతుల నిరసనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఢిల్లీలో శనివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. రైతుల సమస్యలపై స్పందించారు. రైతుల డిమాండ్లు, వారి ప్రతి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని అమిత్ షా స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాల వల్ల రైతులకు మేలే జరుగుతుందని ఉద్ఘాటించారు. ‘వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న రైతులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైతులు తమ ఆందోళనలను విరమించాలి. రైతులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఇప్పటికే చర్చలు జరిపేందుకు ఆహ్వానించారు. డిసెంబర్ 3వ తేదీన రైతులతో వ్యవసాయ శాఖా మంత్రి తోమర్ చర్చలు జరుపుతారు. వారి ప్రతి సమస్యను విని పరిష్కరించేందుకు కృషి చేస్తాం.’ అంటూ హోంమంత్రి అమిత్ షా చెప్పుకొచ్చారు.