మెట్రో విషాదం: మౌనిక కుటుంబానికి నష్టపరిహారం, ఒకరికి జాబ్

అమీర్‌పేట మెట్రో రైలు స్టేషన్‌లో పెచ్చులు ఊడి పడి మృతి చెందిన మౌనిక కుటుంబానికి మెట్రో అధికారులు ఎక్స్‌గ్రేషియా ఎనౌన్స్ చేశారు. ఆమె కుటుంబానికి రూ.20 లక్షల పరిహారంతో పాటు ఒకరికి ఉద్యోగం ఇవ్వడానికి అంగీకరించారు. ఇక 15 లక్షల ఇన్సూరెన్స్ కూడా ఆమె కుటుంబానికి దక్కనుంది. ఈ మేరకు మౌనిక కుటుంబ సభ్యులతో ఎల్ అండ్ టీ సిబ్బంది  ఈ రోజు  చర్చలు జరిపారు. ముందుగా అమీర్ పేట దుర్ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ మౌనిక […]

మెట్రో విషాదం: మౌనిక కుటుంబానికి నష్టపరిహారం, ఒకరికి జాబ్
Ram Naramaneni

|

Sep 23, 2019 | 4:23 PM

మీర్‌పేట మెట్రో రైలు స్టేషన్‌లో పెచ్చులు ఊడి పడి మృతి చెందిన మౌనిక కుటుంబానికి మెట్రో అధికారులు ఎక్స్‌గ్రేషియా ఎనౌన్స్ చేశారు. ఆమె కుటుంబానికి రూ.20 లక్షల పరిహారంతో పాటు ఒకరికి ఉద్యోగం ఇవ్వడానికి అంగీకరించారు. ఇక 15 లక్షల ఇన్సూరెన్స్ కూడా ఆమె కుటుంబానికి దక్కనుంది. ఈ మేరకు మౌనిక కుటుంబ సభ్యులతో ఎల్ అండ్ టీ సిబ్బంది  ఈ రోజు  చర్చలు జరిపారు.

ముందుగా అమీర్ పేట దుర్ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ మౌనిక కుటంబు సభ్యులు గాంధీ ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. రూ.50 లక్షలు ఇవ్వాలని ఎల్ అండ్ టీని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో గాంధీ ఆస్పత్రికి వచ్చిన ఎల్ అండ్ టీ ప్రతినిధులు.. మౌనిక కుటుంబ సభ్యులతో  చర్చలు జరిపారు. అవి ఫలించిన అనంతరం  మృతదేహానికి గాంధీ ఆస్పత్రి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు.

అమీర్‌పేట స్టేషన్‌లో మెట్రో పిల్లర్‌కు చేసిన సిమెంట్‌ ప్లాస్టరింగ్‌ పెచ్చు ఊడి.. 30 అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారిగా మీద పడటంతో మౌనిక తలకు బలంగా గాయమై…తీవ్ర రక్తస్రావమైంది.  దీంతో దగ్గర్లో ఉన్న హాస్పటల్‌కి తీసుకెళ్లేలోపే ఆమె మృతి చెందింది. వాన కురుస్తుండటంతో మెట్రో స్టేషన్‌ కింద కాసేపు ఆగిన మౌనికకు అక్కడ మెట్రో పిల్లరే మృత్యు కారకంగా మారింది. కాగా మౌనికకు ఏడాదిన్నర క్రితమే పెళ్లి అవ్వడం..సాఫీగా సాగిపోతున్న జీవితంలో ఒక్కసారిగా జరిగిన దుర్ఘటనతో ఆమె భర్త హరికాంత్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

కాగా ఈ ఘటనపై ప్రజల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. అతికొద్దికాలంలోనే మెట్రో పెచ్చులు ఊడిపడటం, చీలికలు రావడం వంటివి చూస్తుంటే..ఎల్ అండ్ టీ కంపెనీ వాటిని కట్టే విషయంలో ఎంత నిబద్దతతో వ్యవహారించిందో  అర్ధమవుతుందంటూ జనం చర్చించుకుంటున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu