
ఏపీలో టీడీపీకి మరో షాక్ తగిలింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, టీడీపీ నేత అంబికా కృష్ణ ఆ పార్టీని వీడనున్నారు. త్వరలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న అంబికా.. అక్కడ బీజేపీ ప్రతినిధులతో సమావేశమై తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. అయితే ఈ ఎన్నికల్లో దారుణ పరాజయానికి గురైన టీడీపీకి వరుస షాక్‌లు పడుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు కాషాయ కండువాను కప్పుకోగా.. మరికొందరు కూడా ఆ పార్టీలోకి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఫ్యామిలీతో ఫారిన్ టూర్ వెళ్లిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ ఇండియాకు బయలుదేరనున్నట్లు సమాచారం.