గుడ్ న్యూస్ చెప్పిన కేటీఆర్, తెలంగాణలో అమెజాన్ భారీ పెట్టుబడులు

తెలంగాణ ప్రజలకు మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణలో అమెజాన్ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టబోతున్నట్లు వెల్లడించారు.

గుడ్ న్యూస్ చెప్పిన కేటీఆర్, తెలంగాణలో అమెజాన్ భారీ పెట్టుబడులు
Follow us

|

Updated on: Nov 06, 2020 | 12:12 PM

తెలంగాణ ప్రజలకు మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణలో అమెజాన్ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టబోతున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ 20, 761 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనున్నట్లు చెప్పారు.  అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా తెలంగాణలో ఏషియా పసిఫిక్ రీజియన్ ఏర్పాటుకు అమెజాన్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాదులో మూడు అవైలబిలిటీ జోన్లను ఏర్పాటు చేయనుంది.  ప్రతి అవైలబిలిటీ జోన్లో అనేక డాటా సెంటర్ల ఏర్పాటు చేయనున్నారు.  2022 సంవత్సర ప్రథామార్దంలో  అమెజాన్ వెబ్ సర్వీసెస్ తెలంగాణలో కార్యకలాపాలు ప్రారంభించనుంది.

అమెజాన్ భారీ పెట్టుబడిని  మంత్రి కేటీఆర్ స్వాగతించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఇదేనని చెప్పారు. ఇంత భారీ పెట్టుబడి రావడం అంటే తెలంగాణ ప్రభుత్వ విధానాలకు ఉన్న ప్రాధాన్యత ఏంటో అర్థం చేసుకోవాలని కోరారు. తెలంగాణ పారదర్శక, వేగవంతమైన పరిపాలన విధానాల వల్లనే తెలంగాణకు భారీ పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ను తన దావోస్ పర్యటనలో కలిసిన విషయాన్ని ఈ సందర్భంగా  కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ పెట్టుబడి తర్వాత తెలంగాణ డేటా సెంటర్ల పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ పెట్టుబడి ద్వారా ఇప్పటికే అతిపెద్ద కార్యాలయాన్ని కలిగి ఉన్న అమెజాన్ సంస్థతో తెలంగాణ బంధం మరింత బలోపేతం అవుతుందన్న మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

Also Read :

ఏపీలో మెడికల్ కోర్సుల ఫీజులు సవరించిన ప్రభుత్వం

వర్మ ‘మర్డర్’ సినిమా విడుదలకు లైన్ క్లియర్

చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు