ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర.. భద్రత కట్టుదిట్టం

జమ్ముకశ్మీర్‌‌లో పవిత్ర అమర్‌నాథ్ తొలి యాత్ర ప్రారంభమైంది. ఈ ఉదయం 5.30గంటలకు అనంతనాగ్ జిల్లా అభివృద్ధి అధికారి ఖలీద్ జహింగీర్ జెండా ఊపి ఈ యాత్రను ప్రారంభించారు. ఆదివారం జమ్ము బేస్ క్యాంపు నుంచి బల్తాల్ బేస్ క్యాంప్‌కు బయల్దేరిన యాత్రికుల బృందంతో ఇవాళ్టి యాత్ర ప్రారంభమైంది. తొలి బృందంలో 2800మంది భక్తులు ఉన్నారు. కాగా ఈ యాత్రను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులు చేపట్టవచ్చేని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. యాత్రకు […]

  • Tv9 Telugu
  • Publish Date - 12:18 pm, Mon, 1 July 19
ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర.. భద్రత కట్టుదిట్టం

జమ్ముకశ్మీర్‌‌లో పవిత్ర అమర్‌నాథ్ తొలి యాత్ర ప్రారంభమైంది. ఈ ఉదయం 5.30గంటలకు అనంతనాగ్ జిల్లా అభివృద్ధి అధికారి ఖలీద్ జహింగీర్ జెండా ఊపి ఈ యాత్రను ప్రారంభించారు. ఆదివారం జమ్ము బేస్ క్యాంపు నుంచి బల్తాల్ బేస్ క్యాంప్‌కు బయల్దేరిన యాత్రికుల బృందంతో ఇవాళ్టి యాత్ర ప్రారంభమైంది. తొలి బృందంలో 2800మంది భక్తులు ఉన్నారు.

కాగా ఈ యాత్రను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులు చేపట్టవచ్చేని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. యాత్రకు దాదాపు 30వేల మందికి పైగా పోలీసులు, సైనిక సిబ్బందితో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసింది. నిత్యం సీఆర్పీఎఫ్ సిబ్బంది, సీసీ కెమెరాలు, డ్రోన్లతో దారి పొడవునా పహారా కాయనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా 46రోజుల పాటు సాగే ఈ యాత్రలో పాల్గొనేందుకు ఈసారి దేశ వ్యాప్తంగా 1.5లక్షలకు పైగా భక్తులు పేర్లు నమోదు చేసుకున్న విషయం తెలిసిందే.