జెర్సీ రంగే కొంప ముంచింది: మెహబూబా ముఫ్తీ

భారత్ వరుస విజయాలకు బ్రేక్ పడింది. బర్మింగ్‌‌హామ్ వేదికగా జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ వరల్డ్ కప్ టోర్నీ లీగ్ మ్యాచ్‌లో.. భారత బౌలర్లను ఇంగ్లాండ్ ఓ ఆట ఆడుకుంది. 1992 తర్వాత ప్రపంచకప్‌లో తొలిసారి ఇంగ్లండ్ జట్టు భారత్‌ను ఓడించింది. అయితే తాజాగా టీమిండియా తొలి ఓటమి పై జమ్ముకాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత జట్టు జెర్సీ రంగు మారడం వల్లే జట్టు ఓటమి పాలైందని ఆమె అన్నారు. […]

జెర్సీ రంగే కొంప ముంచింది: మెహబూబా ముఫ్తీ
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 01, 2019 | 7:52 PM

భారత్ వరుస విజయాలకు బ్రేక్ పడింది. బర్మింగ్‌‌హామ్ వేదికగా జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ వరల్డ్ కప్ టోర్నీ లీగ్ మ్యాచ్‌లో.. భారత బౌలర్లను ఇంగ్లాండ్ ఓ ఆట ఆడుకుంది. 1992 తర్వాత ప్రపంచకప్‌లో తొలిసారి ఇంగ్లండ్ జట్టు భారత్‌ను ఓడించింది. అయితే తాజాగా టీమిండియా తొలి ఓటమి పై జమ్ముకాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత జట్టు జెర్సీ రంగు మారడం వల్లే జట్టు ఓటమి పాలైందని ఆమె అన్నారు. తనది మూఢనమ్మకమని అనుకున్నా తాను మాత్రం ఇదే చెబుతానని ముఫ్తీ స్పష్టం చేశారు.

ఐసీసీ నిబంధనల ప్రకారం తలపడుతున్న ఏ రెండు జట్లు ఒకే రంగు జెర్సీలను ధరించకూడదు. ఇంగ్లండ్-భారత జట్ట జెర్సీలు రెండూ నీలమే కావడంతో భారత్ జట్టు జెర్సీని బీసీసీఐ మార్చింది. ముదురు ఆరెంజ్ రంగుతో సరికొత్త జెర్సీని తీసుకొచ్చింది. భారత జట్టు ప్రదర్శనపై జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా అసహనం వ్యక్తంచేశారు. భారత బ్యాటింగ్ ఆసక్తి లేకుండా సాగిందన్నారు. మరింత బాగా ఆడి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.

ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు ఓటమి ఎరుగని భారత జట్టుకు మోర్గాన్ సేన కళ్లెం వేసింది. మ్యాచుల్లో వరుస విజయాలను నమోదు చేసిన కోహ్లీ సేన… ఇంగ్లండ్ ఇచ్చిన 338 పరుగుల భారీ టార్గెట్‌ ఛేదనలో తడబడింది. అటు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్‌ను నిలువరించడంలో బౌలింగ్ పరంగా విఫలమవగా, లక్ష్యఛేదనలో బ్యాటింగ్ పరంగానూ టీమిండియా విఫలమైంది. ఫలితంగా టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 306 పరుగులకు పరిమితమైంది. దీంతో ఇంగ్లాండ్ 31 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది.

ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు