బీసీజీ రిపోర్ట్ బోగస్ : అమరావతి పరిరక్షణ సమితి

|

Jan 04, 2020 | 9:49 PM

రాజధాని విషయంలో  బీసీజీ ఇచ్చిన రిపోర్ట్ బోగస్ అంటూ అమరావతి పరిరక్షణ సమితి మండిపడింది. ప్రభుత్వం మూడు రాజధానులపై వెనక్కి తగ్గేవరకు ఆందోళనలు విరమించేది లేదని సమితి సభ్యులు స్పష్టం చేశారు. 18 రోజులుగా అమరావతి రైతులు రోడ్లపైకి వచ్చి దీక్షలు చేస్తుంటే ప్రభుత్వం ఇసుమంతైనా స్పందిచకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని వాటిపై నుంచి ప్రజల దృష్టి మరర్చేందుకే..ప్రభుత్వం రాజధాని మార్పును తెరపైకి తెచ్చిందని వారు ఆరోపించారు. రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం […]

బీసీజీ రిపోర్ట్ బోగస్ : అమరావతి పరిరక్షణ సమితి
Follow us on

రాజధాని విషయంలో  బీసీజీ ఇచ్చిన రిపోర్ట్ బోగస్ అంటూ అమరావతి పరిరక్షణ సమితి మండిపడింది. ప్రభుత్వం మూడు రాజధానులపై వెనక్కి తగ్గేవరకు ఆందోళనలు విరమించేది లేదని సమితి సభ్యులు స్పష్టం చేశారు. 18 రోజులుగా అమరావతి రైతులు రోడ్లపైకి వచ్చి దీక్షలు చేస్తుంటే ప్రభుత్వం ఇసుమంతైనా స్పందిచకపోవడం బాధాకరమన్నారు.

రాష్ట్రంలో అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని వాటిపై నుంచి ప్రజల దృష్టి మరర్చేందుకే..ప్రభుత్వం రాజధాని మార్పును తెరపైకి తెచ్చిందని వారు ఆరోపించారు. రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు..జేఏసీతో కలిసి కార్యక్రమాలు రూపకల్పన చేస్తామని సమితి నేతలు తెలిపారు. రాజకీయాలను పక్కనబెట్టి అన్ని పార్టీల నేతలు ఉద్యమానికి సహకరించాలని కోరారు. కాగా రాజధానికి భూమి ఇచ్చిన దొండపాడుకు చెందిన రైతు మల్లిఖార్జునరావు ఆవేదనతో మృతి చెందడం తీవ్ర బాధ కలిగించిందని సమితి సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.