ప్రభుత్వ బంగళాల కేటాయింపును ‘హేతుబధ్ధం’ చేస్తున్నాం, కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పురి, ఎప్పటి విధానమిది అని వ్యాఖ్య
ప్రభుత్వ బంగళాల కేటాయింపు విధానాన్ని 'హేతుబధ్ధం' చేస్తున్నామని హౌసింగ్, అర్బన్ వ్యవహారాల శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురి తెలిపారు. ఏదో పేట్రనేజ్ (సపోర్ట్) అన్న పధ్దతిని కేంద్రం విడనాడుతోందన్నారు.

ప్రభుత్వ బంగళాల కేటాయింపు విధానాన్ని ‘హేతుబధ్ధం’ చేస్తున్నామని హౌసింగ్, అర్బన్ వ్యవహారాల శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురి తెలిపారు. ఏదో పేట్రనేజ్ (సపోర్ట్) అన్న పధ్దతిని కేంద్రం విడనాడుతోందన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత భరత్ శివాజీతో బాటు పలువురు కళాకారులకు కేటాయించిన ప్రభుత్వ వసతి గృహాలను ఖాళీ చేయాలంటూ తన మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వులపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ విధమైన పథకమేదీ లేదని, ఈ బంగళాల్లో తాము ఎంతకాలం ఉంటామో వీరికే తెలియదని ఆయన అన్నారు. ఎప్పుడో 30,40 ఏళ్ళ క్రితం ఒరిజినల్ అలాట్ మెంట్ విధానం అమల్లోకి వచ్చిందని, వారి ఆదాయం కూడా తక్కువేనన్న వార్తలు, ఊహాగానాలుతలెత్తాయని. పైగా వీరిలో చాలామందికి సొంత ఇళ్ళు కూడా ఉన్నాయని పురి చెప్పారు. అందుకే ప్రస్తుతం ఈ కేటాయింపు విధానాన్ని హేతుబధ్ధం చేస్తున్నామన్నారు.
27 మంది ప్రముఖ ఆర్టిస్టులు, డ్యాన్సర్లు, మ్యుజిషియన్లకు తాము ఉంటున్న ప్రభుత్వ బంగళాలను ఖాళీ చేయాల్సిందిగా గత అక్టోబరులో హౌసింగ్ శాఖ నోటీసులు పంపింది. లేనిపక్షంలో తగిన చర్యలు తీసుకుంటామని హెచ్ఛరించింది. కాగా-ఓ వెబ్ పోర్టల్ ను, ఈ-సంపద అనే మొబైల్ యాప్ ని లాంచ్ చేసిన హర్ దీప్ సింగ్ పురి..28 నగరాల్లో ప్రభుత్వ సంస్థలకు స్పేస్ తో బాటు లక్ష ప్రభుత్వ వసతి గృహాల కేటాయింపునకు ఈ యాప్ తోడ్పడుతుందని వెల్లడించారు.



