మోదీజీ.. మీరే మా బలంః జగన్

భారత్, చైనా దేశాల మధ్య బోర్డర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ ఆల్ పార్టీ మీటింగ్‌ జరిగిన సంగతి తెలిసిందే.

మోదీజీ.. మీరే మా బలంః జగన్

Updated on: Jun 19, 2020 | 10:43 PM

భారత్, చైనా దేశాల మధ్య బోర్డర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ ఆల్ పార్టీ మీటింగ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో ప్రధాని అన్ని పార్టీల చీఫ్‌లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ అయ్యారు. గాల్వన్ ఘర్షణపై వామపక్ష పార్టీల నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఇక ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన అభిప్రాయాన్ని మోదీతో పంచుకున్నారు. ప్రపంచదేశాల్లో భారత్ ను శక్తివంతమైన దేశంగా మార్చడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి ఎంతగానో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఖ్యాతి పెరగడంతో మోదీ కీలకమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మించారన్నారు. 20 మంది భారత జవాన్ల మృతికి విచారం వ్యక్తం చేసిన జగన్.. వారి కుటుంబాలకు అండగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. భారతదేశాన్ని అస్థిరపరిచేందుకు చైనా ప్రయత్నిస్తోందన్న జగన్.. వ్యాపార, ఆర్ధిక, అంతర్జాతీయ ఒత్తిడితోనే ఆ దేశంపై యుద్ధం చేయాలని తెలిపారు.