ఆల్‌ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు ప్రెసిడెంట్ కన్నుమూత.. అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన మౌలానా కల్బే సాదిక్

ఆల్‌ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు మౌలానా కల్బే సాదిక్ (83) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సాదికక్ మంగళవారం రాత్రి ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో లోని ఓ హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు.

ఆల్‌ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు ప్రెసిడెంట్ కన్నుమూత.. అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన మౌలానా కల్బే సాదిక్
Follow us

|

Updated on: Nov 25, 2020 | 11:46 AM

ఆల్‌ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు మౌలానా కల్బే సాదిక్ (83) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సాదికక్ మంగళవారం రాత్రి ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో లోని ఓ హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. సాదిక్ నిమోనియా, మూత్రసంబంధ క్యానర్స్‌తో బాధపడుతూ ఈ నెల 17న ఎరా మెడికల్ కాలేజీలో చేరారు. ఆయనకు అప్పటి నుంచి అత్యవసర చికిత్స అందిస్తున్నారు వైద్యులు. కాగా, మంగళవారం అర్థరాత్రి తీవ్ర అస్వస్థతకు గురై మరణించినట్లు ఆయన కుమారుడు కల్బే సిబ్లైన్ తెలిపారు.

అలీఘడ్ ముస్లిమ్ విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదివిన మౌలానా కల్బే సాదిక్ అరబిక్ సాహిత్యంలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. లక్నో యూనివర్శిటీ నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. సాదిక్ భార్య, ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. సాదిక్ మృతి పట్ల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. నిరాశ్రయులకు ఆశ్రయం మిచ్చిన సాదిక్ మృతి తీరని లోటని పలువురు పేర్కొన్నారు. లక్నో చరిత్రలో షియా-సున్నీ నమాజ్ నిర్వహించిన మొదటి వ్యక్తి సాదిక్ అని ఆల్ ఇండియా షియా పర్సనల్ లా బోర్డ్ ప్రధాన కార్యదర్శి మౌలానా యూసూబ్ అబ్బాస్ అన్నారు.