‘ఓటింగ్ కి గైర్ హాజరయితే నిన్ను మంత్రిని చేస్తాం’.. లాలూ యాదవ్ ‘తాయిలం’, వైరల్ అయిన వీడియో !
బీహార్లో నితీష్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లోనే ఉంటూ ఎన్డీయే ఎమ్మెల్ల్యేలను ప్రలోభ పెడుతున్నారంటూ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ చేసిన ఆరోపణకు....
బీహార్లో నితీష్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లోనే ఉంటూ ఎన్డీయే ఎమ్మెల్ల్యేలను ప్రలోభ పెడుతున్నారంటూ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ చేసిన ఆరోపణకు నిదర్శనంగానా అన్నట్టు లాలూ చేసినట్టు చెబుతున్న ఓ వ్యాఖ్య తాలూకు వీడియో బయటపడి వైరల్ అవుతోంది. అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక సందర్భంగా జరిగే ఓటింగ్ లో పాల్గొనవద్దంటూ లాలన్ పాశ్వాన్ అనే ఎమ్మెల్యేకు ఆయన సూచిస్తూ..ఇందుకు మీకు మంత్రి పదవి ఇస్తామని ప్రలోభ పెట్టారట.. ఆర్జేడీ అధికారంలోకి రాగానే ఈ పని చేస్తామని హామీ ఇచ్చారట. ఓటింగ్ లో పాల్గొనకపోవడం తనకు కష్టమని ఆ ఎమ్మెల్యే చెప్పగా..కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని చెప్పి గైర్ హాజరు కావాలని లాలూ ప్రసాద్ సలహా ఇఛ్చినట్టు ఈ వీడియోలో వినబడుతోంది. అయితే ఇది ఫేక్ అని, ప్రజా సమస్యల నుంచి ప్రభుత్వ దృష్టిని మళ్లించడానికి బీజేపీ చేసిన ప్రయత్నమని ఆర్జేడీ అంటోంది. ఈ వీడియోలో వినబడిన గొంతు లాలూది కాదని చెబుతోంది.