Plants Exhibition in Hyderabad: హైదరాబాద్ లోని నెక్లెస్‌రోడ్డు పీపుల్స్ ప్లాజా వేదికగా అరుదైన జాతుల పువ్వులు.. రకరకాల మొక్కలు కొలువుదీరనున్నాయి. ఈరోజు నుంచి ఐదు రోజుల పాటు నగరంలో దేశ, విదేశీ మొక్కలు కనువిందు చేయనున్నాయి. ఉద్యాన వన ప్రదర్శనలో పూల మొక్కలు, పండ్ల జాతులు, విత్తనాలు, ఆర్గానిక్ ఉత్పత్తులు, అగ్రికల్చర్ సైన్స్, మొక్కల పెంపకానికి ఉపయోగపడే పరికరాలు, వస్తువులు ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేయనున్నాయి.
గురువారం ఉదయం తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్ ఆధ్వర్యంలో 9వ గ్రాండ్ నర్సరీ మేళా ప్రారంభంకానున్నది. కొవిడ్ జాగ్రత్తల మధ్య ఫిబ్రవరి 1 వరకు నిర్వహించనున్నారు. ఈ ఆలిండియా హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ షోలో బెంగళూరు, కోల్‌కత్తా, ఢిల్లీ, ముంబై, పుణె, చెన్నై తదితర సుమారు 19 రాష్ట్రాల నుంచి వ్యాపారులు పాల్గొంటారు. 120 స్టాల్స్ లో మొక్కలు కొలువుదీరనున్నాయి. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు మేళాను సందర్శించవచ్చు. కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ తమకు నచ్చిన సామగ్రిని నగరవాసులు కొనుగోలు చేయవచ్చని నిర్వాహకులు సూచిస్తున్నారు.
Also Read: పెళ్లి చేసుకుని సమాజసేవ చేద్దామంటూ.. ముహర్తం పెట్టించి.. 14 లక్షలు కొట్టేసిన కిలాడీ లేడీ..