పాక్‌ సినీ కళాకారులపై జీవితకాల నిషేధం

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 2:13 PM

పుల్వామా దాడి నేపథ్యంలో ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నది. పాకిస్తాన్‌కు చెందిన సినీ నటులు, ఇతర కళాకారులపై నిషేధం విధించింది. పుల్వామాలో భారత సైనికులపై ఉగ్రదాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని సంఘం ప్రధాన కార్యదర్శి రోణక్‌ సురేష్‌ జైన్‌ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామని ఆయన అన్నారు. సినీ రంగంలో పని చేస్తున్న పాకిస్తాన్‌ నటులు, ఇతర కళాకారులపై పూర్తిగా నిషేధం విధిస్తున్నామని అధికారికంగా ప్రకటిస్తున్నామని జైన్‌ […]

పాక్‌ సినీ కళాకారులపై జీవితకాల నిషేధం
Follow us on

పుల్వామా దాడి నేపథ్యంలో ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నది. పాకిస్తాన్‌కు చెందిన సినీ నటులు, ఇతర కళాకారులపై నిషేధం విధించింది. పుల్వామాలో భారత
సైనికులపై ఉగ్రదాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని సంఘం ప్రధాన కార్యదర్శి రోణక్‌ సురేష్‌ జైన్‌ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామని ఆయన అన్నారు. సినీ రంగంలో పని చేస్తున్న పాకిస్తాన్‌ నటులు, ఇతర కళాకారులపై పూర్తిగా నిషేధం విధిస్తున్నామని అధికారికంగా ప్రకటిస్తున్నామని జైన్‌ అన్నారు. ఏ సంస్థ అయినా పాకిస్తాన్‌ కళాకారులతో పని చేస్తుంటే వాటిపై నిషేధం విధిస్తామని, కఠిన చర్యలు తీసుకుంటామని జైన్‌ హెచ్చరించారు. తమకు దేశం ప్రధానమని, తాము దేశం తరఫునే నిలబడతామని జైన్‌ పేర్కొన్నారు.

నిజానికి 2016లో ఉరి దాడి జరిగినప్పటి నుంచే పాక్ నటీనటులపై నిషేధం విధించడం ప్రారంభించారు. అప్పట్లో పలువురు పాకిస్థాన్ నటులు ఉన్న సినిమాల విడుదలకు కూడా అడ్డంకులు ఏర్పడ్డాయి. తాజాగా పాక్ నటీనటులపై పూర్తి నిషేధించాలన్న నిర్ణయాన్ని నెటిజన్లు స్వాగతించారు. ఈ ఉగ్ర దాడి తర్వాత దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఇందులో సినిమా ఇండస్ట్రీ కూడా పాలుపంచుకుంది. ఒక రోజు పాటు అన్ని షూటింగ్‌లను నిలిపేసింది. ఈ నిరసన పాల్గొన్న బిగ్ బి అమితాబ్ బచ్చన్.. పుల్వామా దాడి అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం కూడా అందించాడు.