బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ రికార్డులను బద్ధలు కొడుతున్నారు అక్షయ్ కుమార్(Akshay Kumar). కరోనా (corona virus) కాలంలోనూ వరుసగా సినిమాలు చేసి హిట్ కొట్టాడీ సూపర్ స్టార్. ఇక కరోనా రెండో దశ ఉద్ధృతి తర్వాత ‘సూర్యవంశీ’ (Sooryavamshi) సినిమాతో బాలీవుడ్ సినిమా పరిశ్రమకు పునఃవైభవం తీసుకొచ్చారు. ప్రస్తుతం అక్షయ్ చేతిలో సుమారు అరడజనుకు పైగా సినిమాలున్నాయి. సినిమాల సంగతి పక్కన పెడితే ఈ సీనియర్ నటుడి గురించి బాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్ లో ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది. ముంబయిలోని ఖరీదైన ప్రాంతంలో ఓ విలాసవంతమైన అపార్ట్ మెంట్ కొన్నాడని అక్కడి మీడియా కోడై కూస్తోంది.
ముంబయ్ లోని ఖార్ వెస్ట్ లోని జాయ్ లెజెంట్ భవనంలో 19వ ప్లోర్ లో ఉన్న అపార్ట్ మెంట్ ను అక్షయ్ కొనుగోలు చేశాడట. 1878 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉన్న ఈ అపార్ట్ మెంట్ ధర కోసం ఏకంగా రూ. 7. 8 కోట్లు ఖర్చు చేశాడట అక్షయ్. కాగా ఆయన ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి ముంబయ్ లోని అత్యంత ఖరీదైన ప్రాంతం జూహూలో ఓ డూప్లెక్స్ బిల్డింగ్ లో ఉంటున్నారు. ఇక అక్షయ్ కు గతంలో అంధేరిలో ఓ ఖరీదైన కమర్షియల్ స్పేస్ ఉండేది. ఈ మధ్యే దానిని రూ. 9 కోట్లకు విక్రయించారు. వీటితో పాటు ముంబయ్ లోపలు ప్రాంతాలు, గోవా, మారిషస్ లో కూడా అక్షయ్ కు కమర్షియల్ బిల్డింగ్స్ ఇతర ఆస్తులు ఉన్నట్లు సమాచారం.
Also Read: Harish Rao: కేంద్రంపై మరో లేఖాస్త్రం సంధించిన హరీశ్ రావు.. ఈసారి దేనికోసమంటే..
Coronavirus: కరోనా బారిన పడ్డ ఎన్సీపీ అధినేత.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన ప్రధాని మోదీ..