ఢిల్లీ ఎయిమ్స్ లో ఓపీడీ అడ్మిషన్లకు తాత్కాలికంగా బ్రేక్

| Edited By: Pardhasaradhi Peri

Sep 02, 2020 | 6:58 PM

ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో ఎన్నడూ లేని విచిత్ర పరిస్థితి ఏర్పడింది. నాన్-కోవిడ్ రోగుల సంఖ్య పెరుగుతూ  వారిని తరచూ ఎమర్జెన్సీ వార్డుల్లో చేర్చవలసి వస్తుండడంతో 'రద్దీ' పెరిగిన దృష్ట్యా జనరల్..

ఢిల్లీ ఎయిమ్స్ లో ఓపీడీ అడ్మిషన్లకు తాత్కాలికంగా బ్రేక్
Follow us on

ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో ఎన్నడూ లేని విచిత్ర పరిస్థితి ఏర్పడింది. నాన్-కోవిడ్ రోగుల సంఖ్య పెరుగుతూ  వారిని తరచూ ఎమర్జెన్సీ వార్డుల్లో చేర్చవలసి వస్తుండడంతో ‘రద్దీ’ పెరిగిన దృష్ట్యా జనరల్, ప్రైవేట్ వార్డుల్లో ఓపీడీ  అడ్మిషన్లను  రెండువారాల పాటు నిలిపివేశారు. అయితే వైద్య సలహాలు, కౌన్సెలింగ్ కోసం రోగులు రావచ్ఛునని ఓ సర్క్యులర్ లో పేర్కొన్నారు. ట్రామా సెంటర్ ని కూడా కోవిడ్ సెంటర్ గా మార్చవలసి వచ్చిందని అందువల్లే ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. రెండు వారాల అనంతరం పరిస్థితిని సమీక్షించి మళ్ళీ నిర్ణయం  తీసుకోనున్నారు.