ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు.. డిగ్రీ కోర్సుల్లో వీడియో పాఠాలు..

తెలంగాణలో ఫస్ట్ ఇయర్ మినహా మిగతా ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆగస్టు 17న్ముంచి క్లాసులు ప్రారంభం కానున్నాయి. కాగా ఆన్‌లైన్‌ బోధనకు అధికారులు మొగ్గుచూపుతున్నారు. తదుపరి కార్యాచరణపై ఉన్నత, సాంకేతిక

ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు.. డిగ్రీ కోర్సుల్లో వీడియో పాఠాలు..

Edited By:

Updated on: Jul 19, 2020 | 2:51 PM

తెలంగాణలో ఫస్ట్ ఇయర్ మినహా మిగతా ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆగస్టు 17న్ముంచి క్లాసులు ప్రారంభం కానున్నాయి. కాగా ఆన్‌లైన్‌ బోధనకు అధికారులు మొగ్గుచూపుతున్నారు. తదుపరి కార్యాచరణపై ఉన్నత, సాంకేతిక విద్యాశాఖలు దృష్టి సారించాయి. ఇందులో భాగంగా జేఎన్‌ టీయూ, ఓయూ రిజిస్ట్రార్‌లతోనూ ఉన్నతాధికారులు శుక్రవారం చర్చించారు. ఇప్పటికే జేఎన్‌టీయూ కరోనా నేపథ్యంలో అనుసరించాల్సిన విద్యా బోధన ప్రణాళికపై ఓ నివేదికను సిద్ధం చేసింది. దానిని కూడా అధికారులు పరిశీలించారు.

సదరు కార్యాచరణ అమలుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులు సూచించారు. ముందుగా కాలేజీలు విద్యార్థులకు వెబినార్‌లు నిర్వహించాలని నిర్ణయించారు. వాటిని ఇప్పుటి నుంచే ప్రారంభిస్తే విద్యార్థులు అలవాటు పడతారని, ఏమైనా లోటుపాట్లు ఉన్నా తెలుస్తాయని, వీటిని సవరించుకొని ఆగస్టు 17వ తేదీనుంచి రెగ్యులర్‌ తరగతులను ఆన్‌లైన్‌లో నిర్వíహించవచ్చన్న నిర్ణయానికి వచ్చారు. అయితే ఆన్‌లైన్‌ తరగతులను ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లోనే అమలు చేయడం సాధ్యం అవుతుందన్న భావనకు వచ్చారు.

డిగ్రీ కోర్సుల్లో రూరల్ ఏరియాలకు చెందిన విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నందున, డిగ్రీ కోర్సుల్లో రికార్డెడ్‌ వీడియో పాఠాలను బోధించాలన్న నిర్ణయానికి వచ్చారు. ముఖ్యంగా టీశాట్, దూరదర్శన్‌ వంటి చానళ్ల ద్వారా, మరోవైపు యూట్యూబ్‌ చానళ్ల ద్వారా వీటిని ప్రసారం చేస్తే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందన్న అభిప్రాయానికి వచ్చారు. ఇలా సాంకేతిక విద్యా కోర్సుల్లో ఆన్‌లైన్‌ బోధనను, సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో వీడియో పాఠాలను రెండు మూడు నెలలపాటు నిర్వహించనున్నారు.

Also Read: పాతబస్తీ లాల్ దర్వాజ బోనాలు ప్రారంభం..